×
Ad

IND vs WI : భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్‌.. హెడ్‌-టు-హెడ్ రికార్డులు ఇవే.. ఎవ‌రిది పై చేయి అంటే?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా ఆదివారం భార‌త్, వెస్టిండీస్ (IND vs WI) జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

IND vs WI Head to head records Ahead of T20 World Cup 2026 Super 8 clash

  • ఆదివారం భార‌త్ వ‌ర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌
  • టీ20ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 30 సార్లు త‌ల‌ప‌డిన రెండు జ‌ట్లు
  • మెరుగైన రికార్డును క‌లిగిన ఉన్న భార‌త్.. అయితే..

IND vs WI : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా ఆదివారం భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు నేరుగా సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెడుతుంది. రెండు జ‌ట్ల‌కు కూడా చావో రేవో లాంటిది కావ‌డంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవ‌కాశం ఉంది. సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలో భార‌త్ బ‌రిలోకి దిగ‌నుండ‌గా వెస్టిండీస్ జ‌ట్టుకు షాయ్ హోప్ నాయ‌క‌త్వం వహిస్తున్నాడు.

అంత‌ర్జాతీయ టీ20క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు జ‌ట్లు ఎన్ని సార్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఎవ‌రు ఎక్కువ మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఎన్ని సార్లు ఈ రెండు జ‌ట్లు ఢీకొన్నాయి. ఎవ‌రు పై చేయి సాధించారో ఓ సారి చూద్దాం..

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీలంక ఘోర వైఫ‌ల్యం.. హెడ్ కోచ్ స‌న‌త్ జ‌య‌సూర్య కీల‌క నిర్ణ‌యం.. ఇక చాలు, త‌ప్పుకుంటా..

హెడ్‌-టు-హెడ్..

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్, వెస్టిండీస్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 30 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్ 19 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 10 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు.

ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విష‌యానికి వ‌స్తే.. భార‌త్, వెస్టిండీస్ జ‌ట్లు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో 4 సార్లు ఢీ కొన్నాయి. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ గెల‌వ‌గా, ఒక మ్యాచ్‌లోనే భార‌త్ విజ‌యం సాధించింది.

వెస్టిండీస్ జ‌ట్టుపై భార‌త్ అత్య‌ధిక స్కోరు 192 కాగా.. అత్య‌ల్ప స్కోరు 130గా ఉంది. ఇక వెస్టిండీస్ జ‌ట్టు విష‌యానికి వ‌స్తే.. భార‌త్ పైవిండీస్ అత్య‌ధిక స్కోరు 196 కాగా.. అత్య‌ల్ప స్కోరు 129గా ఉంది.

T20 World Cup 2026 : ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాక్‌ ఔట్‌.. కెప్టెన్సీ పై స‌ల్మాన్ అలీ అఘా హాట్ కామెంట్స్‌.. ఇంటికి వెళ్లాక తీరిగ్గా..

మొత్తంగా చూసుకుంటే టీ20ల్లో విండీస్ పై భార‌త్ కు మెరుగైన రికార్డు ఉన్న‌ప్ప‌టికి కూడా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో మాత్రం విండీస్ రికార్డు ఘ‌నంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.