IND vs ZIM : ఇషాన్ కిష‌న్‌, తిల‌క్ శ‌ర్మ‌లు హాఫ్ సెంచ‌రీలు.. జింబాబ్వే ముందు భారీ ల‌క్ష్యం..

హ‌రారే వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో (IND vs ZIM ) భార‌త బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు

IND vs ZIM 2nd T20 Ishan Kishan and Tilak Varma half centuries team score in 20 overs 219 runs

IND vs ZIM  : హ‌రారే వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు. ఇషాన్ కిష‌న్ (81; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), తిల‌క్ వ‌ర్మ (60 నాటౌట్‌ ; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) లు హాప్ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో భార‌త్ 5 వికెట్ల న‌ష్టానికి 219 ప‌రుగుల స్కోరు సాధించింది. దీంతో జింబాబ్వే ముందు 220 ప‌రుగుల భారీ ల‌క్ష్యం నిలిచింది.

మిగిలిన టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (25; 20 బంతుల్లో 4 ఫోర్లు), వైభ‌వ్ సూర్య‌వంశీ (20; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) లు రాణించారు. అభిషేక్ శ‌ర్మ (8; 8 బంతుల్లో 2 ఫోర్లు) విఫ‌లం అయ్యాడు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ, బ్రియాన్ బెన్నెట్ , న్యూమన్ న్యాముహురి, బ్రాడ్ ఎవాన్స్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.