IND W vs AUS W : విజృంభించిన బౌలర్లు.. కుప్పకూలిన ఆస్ట్రేలియా.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య (IND W vs AUS W )తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- February 15, 2026 / 03:46 PM IST
IND-W vs AUS-W 1st T20 India women target is 134
IND W vs AUS W : మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. భారత బౌలర్లు విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 134 పరుగుల లక్ష్యం నిలిచింది.
ఆసీస్ బ్యాటర్లలో జార్జియా వేర్‌హామ్ (30; 19 బంతుల్లో 4 ఫోర్లు), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (26; 19 బంతుల్లో 5 ఫోర్లు) ఎల్లీస్ పెర్రీ (20; 11 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లు తీసింది. రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీచరణి లు చెరో రెండు వికెట్లు తీశారు. క్రాంతి గౌడ్, దీప్తి శర్మ లు చెరో వికెట్ పడగొట్టారు.
