IND W vs AUS W 2nd T20 match India Women opt to bowl
IND W vs AUS W : మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య కాన్‌బెర్రా వేదికగా రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్, పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాము. గత మ్యాచ్‌లో మా బౌలర్లు చాలా మంచి ప్రదర్శన చేశారు. ఈ రోజు కూడా అలాగే రాణిస్తారని ఆశిస్తున్నాను. మహిళల క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. జట్టు విజయం కోసం పరితపిస్తూనే ఉంటాం. సాధ్యమైనంత కాలం ఆడుతూనే ఉంటా.’ అని హర్మన్ ప్రీత్ కౌర్ అంది.
🚨 Toss Update 🚨#TeamIndia have won the toss and elected to bowl.
Updates ▶️ https://t.co/8prXc1p5fJ#AUSvIND pic.twitter.com/ZGUuDfx75Q
— BCCI Women (@BCCIWomen) February 19, 2026
‘(తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిపోవడం గురించి మాట్లాడుతూ) సిరీస్‌లో మేము వెనకబడి ఉన్నాము. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేస్తామని అనుకుంటున్నాను. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. నాలుగు లేదా ఐదు నెలలుగా ఓ జట్టుగా కలిసి ఆడుతున్నాము. ఈ మ్యాచ్‌లో రాణిస్తామని ఆశిస్తున్నాను.’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్ అంది.
T20 World Cup 2028 : టీ20 ప్రపంచప్ 2028కి నేరుగా అర్హత సాధించిన జట్లు ఇవే.. ప్రకటించిన ఐసీసీ
ఆస్ట్రేలియా తుది జట్టు..
బెత్ మూనీ(వికెట్ కీపర్), జార్జియా వోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లీ గార్డనర్, జార్జియా వేర్‌హామ్, నికోలా కారీ, అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినెక్స్(కెప్టెన్), కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్
#TeamIndia‘s Playing XI for the 2️⃣nd T20I 🙌
Updates ▶️ https://t.co/8prXc1p5fJ#AUSvIND pic.twitter.com/zo6Kcm68iJ
— BCCI Women (@BCCIWomen) February 19, 2026
భారత తుది జట్టు..
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.