Mohammed Shami : షమీకి భారత జట్టు ద్వారాలు మూసుకుపోయాయా? కెరీర్ ఇక ముగిసినట్లేనా?
సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) భారత జట్టు రీఎంట్రీ ద్వారాలు మూసుకుని పోయాయా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- July 30, 2026 / 12:04 PM IST
India Doors Closed For Mohammed Shami report
Mohammed Shami : సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ భారత జట్టు రీఎంట్రీ ద్వారాలు మూసుకుని పోయాయా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు ఫైనల్ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈ కుడి చేతి వాటం పేసర్ భారత జట్టు తరుపున వన్డేల్లో ఛాంపియన్స్ ట్రోపీ 2025లో చివరిసారిగా కనిపించాడు. అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో టీ20ల్లో చివరిసారి ఆడాడు. ఇక టెస్టు మ్యాచ్ ఆడి మూడేళ్లు దాటిపోయింది.
గాయాలతో పోరాడుతూ.. దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేసినప్పటికీ కూడా షమీ జాతీయ జట్టులో తన స్థానాన్ని తిరిగి పొందలేకపోతున్నాడు. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు.
Ajinkya Rahane : అన్ని రకాల క్రికెట్‌కు టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే గుడ్‌బై
స్పోర్ట్‌స్టార్ నివేదిక సెలక్షన్ కమిటీ దీర్ఘకాలిక ప్రణాళికలపై స్పష్టత ఇచ్చింది. ఇది భారత జట్టులోకి తిరిగి రావాలన్న షమీ ఆశలకు మరో దెబ్బగా నిలిచింది. ఆ నివేదిక ప్రకారం.. రాబోయే సంవత్సరాల్లో భారత పేస్ బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా నిలుస్తారని భావిస్తున్న 15 మంది యువ పేసర్ల బృందాన్ని సెలెక్టర్లు గుర్తించారు. మూడు ఫార్మాట్లలోనూ ఈ 15 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేయగా.. ఈ బృందంలో షమీ పేరు లేకపోవడం గమనార్హం.
రాబోయే టెస్టు ఛాంపియన్‌షిప్, 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఎక్కువగా యువ ఆటగాళ్లకే అవకాశం ఇవ్వాలని గంభీర్, అగార్కర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత జట్టులో పరివర్తన దశ మొదలైంది. సీనియర్ల స్థానాల్లో యువకులు వచ్చేస్తున్నారు.
Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీని భయపట్టే బౌలర్ ఎవరో తెలుసా?
అంతకుముందు.. అన్ని ఫార్మాట్లలోనూ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని పక్కన పెట్టాలన్న జట్టు యాజమాన్యం నిర్ణయంపై భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ నిరాశను వ్యక్తం చేశారు. గుర్నూర్ బ్రార్ , మోసిన్ ఖాన్‌లతో పాటు ప్రిన్స్ యాదవ్ కూడా మంచి బౌలర్. ఈ ముగ్గురినీ తక్కువ అంచనా వేయకూడదు. ఇంకా 15 నెలల సమయం ఉంది కాబట్టి.. వారు ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవచ్చు. కానీ షమీ ఒక అద్భుతమైన బౌలర్. యాజమాన్యం అతడిని ఒక పనికిరాని వాడిగా మార్చడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది అని శ్రీకాంత్ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు.
