Ind Vs Aus 3rd Test: జోరు కొనసాగేలా..! నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా ప్లేయర్స్ .. వీడియో వైరల్
మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకోసం ఇండోర్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు చెమటోడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
- Harish Thanniru
- Published on- February 27, 2023 / 03:04 PM IST
Team india
Ind Vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఇండియాలో జరుగుతుంది. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. రెండు టెస్ట్ మ్యాచ్‌లలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలంకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు క్రీజ్‌లో నిలువలేక పోయారు. భారీ స్కోర్ చేసేందుకు ఆస్కారంలేకపోవటంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. రెండు టెస్ట్ మ్యాచ్‌లను మూడు రోజుల్లోనే ఇండియా ముగించేసింది.
India vs Australia 3rd Test: ఆస్ట్రేలియాకు ఊరట.. మూడో టెస్టుకు ఆల్‌రౌండర్ వచ్చేస్తున్నాడు ..
మూడో టెస్టు మ్యాచ్ మార్చి 1నుంచి ఇండోర్‌లో జరుగుతుంది. మూడో టెస్టులోనూ విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకొనేందుకు టీమిండియా పట్టుదలతో ఉంది. సిరీస్ మొత్తాన్ని క్లీన్‌స్వీప్ చేసేలా టీమిండియా గేమ్ ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లు ఎక్కువ సేపు నెట్స్‌లో చమటోడ్చుతున్నారు. అయితే, తొలి రెండు టెస్టు మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. ఆ ఆటగాళ్లుకూడా ఫాంలోకి వస్తే టీమిండియా వచ్చే రెండు టెస్టుల్లోనూ విజయం సాధించడం ఖాయంగా చెప్పొచ్చు.
మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకోసం ఇండోర్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు చెమటోడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లతో కలిసి ప్రాక్టీసు చేస్తున్నారు. వీరితో పాటు స్పీడ్స్టర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనాద్కట్సైతం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.
