IND vs AFG Series Squad : రోహిత్, విరాట్‌లకు ఛాన్స్.. బుమ్రా, పంత్‌తోపాటు వారికి షాక్.. అఫ్గాన్‌తో టెస్టు, వన్డేలకు జట్ల ఎంపిక.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

IND vs AFG Series Squad : అఫ్గానిస్థాన్ జట్టుతో జరిగే ఏకైక టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అవకాశం దక్కగా.. రెండు ఫార్మాట్ల జట్లలోనూ రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు.

IND vs AFG Series Squad

IND vs AFG Series Squad : అఫ్గానిస్థాన్ జట్టుతో జరిగే ఏకైక టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గానిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుతో జరగబోయే సిరీస్ కోసం భారత్ టెస్టు, వన్డే జట్టులో రెండింటిలోనూ రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు కూడా అవకాశం దక్కలేదు. అయితే, వర్క్ లోడ్ దృష్ట్యా బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినట్లు సెలెక్టర్లు పేర్కొన్నారు. మరోవైపు.. వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. అయితే, వన్డేలకు వైస్‌కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్, టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు.

Also Read : Petrol Diesel Price Hike : రూ.3, 4తో లాభం లేదు.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచాలని ప్రతిపాదన.. ఏకంగా..

వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఇదే..
అఫ్గాన్ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం దక్కింది. వీరితోపాటు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. ఆల్ రౌండర్లుగా హార్డిక్ పాండ్యా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబేలకు కూడా జట్టులో చోటు దక్కింది. అయితే, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలను తుదిజట్టులోకి తీసుకోవాలంటే ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది.

భారత వన్డే జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, హర్ష్ డుబ్రార్, గుర్నూర్ దుబేర్.

టెస్టు జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవ్‌దత్ పాడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ క్రిష్ణ, గుర్నూర్ దుబేర్, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)

చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మహ్మద్ షమీ గురించి సెలెక్టర్ల కమిటీ చర్చించలేదని తెలిపాడు. బుమ్రా గురించి మాట్లాడుతూ.. మేము ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేటప్పటికి బుమ్రా తిరిగి వస్తాడు. అతను తన పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో అఫ్గాన్ తో జరిగే మ్యాచ్ లకు దూరమయ్యాడని తెలిపాడు. పంత్ ను వన్డే జట్టు నుంచి తొలగించడంపై అగార్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి అతను టీ20 క్రికెట్ ఆడటానికే సిద్ధంగా ఉన్నాడని మాకు చెప్పాడు. అతను వన్డే జట్టులో భాగం కానప్పటికీ ప్రస్తుతం టెస్టు జట్టులో కీలక ఆటగాడు అని పేర్కొన్నాడు. రవీంద్ర జడేజా గురించి మాట్లాడుతూ.. జడేజా జట్టులో కీలక ఆటగాడు. అతనికి టెస్టు మ్యాచ్ కు విశ్రాంతినిచ్చాం. ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నించాం. ఈ టెస్టు కోసమే అతన్ని మేము పక్కన పెట్టామంటూ అగార్కర్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్‌ల షెడ్యూల్ ..
♦ ఏకైక టెస్టు.. జూన్ 6-10 (చండీగఢ్‌, ముల్లాన్‌ఫుర్)
♦ తొలి వన్డే.. జూన్ 14 (ధర్మశాల)
♦ రెండో వన్డే.. జూన్ 17 (లఖ్‌నవూ)
♦ మూడో వన్డే.. జూన్ 20 (చెన్నై)