అండర్-19 వరల్డ్ కప్: ఫైనల్‌కు చేరిన భారత్

వరుసగా నాలుగు అండర్ 19 మ్యాచ్ లలో పాకిస్తాన్ పై విజయం సాధించింది భారత్. కుర్రాళ్లు అద్భుతహ అనిపించారు. 173పరుగుల లక్ష్య చేధనకు దిగిన టీమిండియా.. 14ఓవర్లు మిగిలి ఉండగానే ఒక్క వికెట్ పడకుండా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో విజయం దక్కించుకున్నారు. యశస్వి జైస్వాల్.. ఈ టోర్నమెంట్‌లో భారత్ తరపున తొలి సెంచరీ నమోదు చేశాడు. చెలరేగి ఆడిన జైస్వాల్ (113 బంతుల్లో 105 పరుగులు 8ఫోర్లు, 4సిక్సులు)తో ఇరగదీశాడు. 

మరో ఎండ్‌లో దివ్యాంశ్ సక్సేనా(59) సహకారంతో మంచి హిట్టింగ్ కనబరిచాడు. అంతకంటే ముందు పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో హైదర్ అలీ(56), రొహైల్ నజీర్(62), మొహమ్మద్ హారిస్(21) తప్ప మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

మొహమ్మద్ హురైరా(4), ఫహద్ మునీర్(0), ఖాశీం అక్రమ్(9), ఇర్ఫాన్ ఖాన్(3), అబ్బాస్ అఫ్రీది(2), తాహిర్ హుస్సేన్(2), అమీర్ అలీ(1), మొహమ్మద్ అమీర్ ఖాన్(0 నాటౌట్)లుగా సరిపెట్టుకున్నారు. భారత బౌలర్లు సుషాంత్ మిశ్రా3వికెట్లు పడగొట్టాగా కార్తీక్ త్యాగి, రవి బిష్ణోయ్ చెరో 2వికెట్లు పడగొట్టగా.. అతర్వా అన్కోలేకర్, యశస్వి జైస్వాల్ చెరో వికెట్ తీశారు.