Arshdeep singh : ఏదీ ఏమైనా గానీ.. పాక్ పై ఆ రికార్డు సాధిస్తే.. ఆ కిక్కే వేరప్పా.. చరిత్రకు అడుగుదూరంలో అర్ష్‌దీప్ సింగ్..
టీమ్ఇండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లోనైనా

Asia cup 2025 IND vs PAK Arshdeep Singh Need One Wicket to create history
Arshdeep singh : దుబాయ్ వేదికగా ఆదివారం పాక్‌తో తలపడనుంది టీమ్ఇండియా. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఎడమ చేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది.
ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకుని అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep singh )ఒక్క వికెట్ తీస్తే చాలు.. అతడు చరిత్ర సృష్టిస్తాడు. టీమ్ఇండియా తరుపున టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు.
Suryakumar Yadav : పాక్ పై సూర్యకుమార్ యాదవ్ రికార్డు చూస్తే షాకే.. వామ్మో ఇలా ఉందేటి?
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఈ ఎడమచేతి వాటం పేసర్ 2022లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 63 టీ20 మ్యాచ్‌ల్లో 8.30 ఎకానమీతో 99 వికెట్లు తీశాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన ఉంది. అత్యుత్తమ ప్రదర్శన 4/9. భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగానూ అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ – 63 మ్యాచుల్లో – 99 వికెట్లు
* యుజ్వేంద్ర చాహల్ – 80 మ్యాచుల్లో 96 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 114 మ్యాచ్‌ల్లో 94 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 87 మ్యాచుల్లో – 90 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 70 మ్యాచుల్లో – 90 వికెట్లు
చోటు దక్కేనా..?
అరంగ్రేటం నుంచి కొన్నాళ్ల పాటు టీమ్ఇండియా టీ20 జట్టులో అర్ష్‌దీప్ సింగ్ ప్రధాన పేసర్‌గా ఉన్నాడు. అయితే.. ఇటీవల కాలంలో ఎందుకనో అతడికి తుది జట్టులో అవకాశాలు రావడం లేదు. అతడు చివరిసారి భారత్ తరుపున ఈ ఏడాది జనవరి 31న ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆడాడు.
అదే సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌తో పాటు ఆసియాకప్ 2025లో యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్ సింగ్‌కు తుది జట్టులో ఛాన్స్ దక్కలేదు. దీంతో వందో వికెట్ కోసం అతడు దాదాపు 6 నెలలకు పైగా నిరీక్షిస్తున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లోనైనా తుది జట్టులో ఛాన్స్ దక్కించుకుని వంద వికెట్ మైలురాయిని చేరుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పాక్ పై ఈ మైలురాయి అందుకుంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని అంటున్నారు.