IND vs PAK : ఆసియాకప్‌లో పాక్‌తో మ్యాచ్.. కొత్త ఫీల్డింగ్ వ్యూహంతో బరిలోకి భారత్..! దబిడిదిబిడే..
ఆసియాకప్ 2025(Asia Cup 2025)లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Asia Cup 2025 Team India Introduce New Fielding Tactic Ahead Of Pakistan Clash
IND vs PAK : ఆసియాకప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు జట్లు కూడా మైదానంలో ప్రాక్టీస్‌ను చేస్తున్నాయి. మ్యాచ్‌లో విజయం సాధించేందుకు తమ తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌తో జరగబోయే మ్యాచ్ కోసం భారత్ సరికొత్త ఫీల్డింగ్ వ్యూహాన్ని అమలు చేయనుంది.
ఈ వ్యూహాం వల్ల పాక్ బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. మైదానంలో ఖాళీలను తగ్గించుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఈ కొత్త ఫీల్డింగ్ వ్యూహాన్ని ప్రవేశపెట్టాడు.
Asia Cup 2025 : ఆసియా కప్‌లో ఈ ఆసక్తికర విషయం తెలుసా..? భారత్, పాక్ మ్యాచ్..
బ్యాటింగ్ నెట్స్ కు దూరంగా గోల్ పోస్ట్ పరిమాణంలో భద్రతా వల ఉన్న గోల్ కీపర్ డ్రిల్ లాంటిది. ఈ డ్రిల్ లో కొత్త బంతులు ఉపయోగిస్తారు. అవి వేగంగా వస్తాయి. ప్రతి ఆటగాడు ఐదు క్యాచ్ ల రెండు సెట్లను పూర్తి చేస్తూ తమ లక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈ డ్రిల్ లో ఎక్కువ మంది ఆటగాళ్ళు ఉండడంతో ఎప్పటి కప్పుడు తమ తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటారు.
హార్దిక్ పాండ్యా ఒక మిస్ తో, తరువాత ఒక బ్లైండర్ తో ఈ డ్రిల్ ను ప్రారంభించినట్లు నివేదిక పేర్కొంది. హార్దిక్ తన కోటాను పూర్తి చేయడానికి మరో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. హార్దిక్ ప్రయత్నం శివం దుబేను కూడా ఆకట్టుకుంది. శుభ్‌మాన్ గిల్, రింకు సింగ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
నాలుగు క్యాచ్‌లు అందుకుని ఫీల్డింగ్ కోచ్ నుంచి గిల్ ప్రశంసలు సైతం పొందాడు. ఇక టీమ్ఇండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ తొలి సెట్‌లో కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే.. రెండో సెట్‌లో గిల్ సహయంతో పుంజుకున్నాడు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు కూడా ఈ డ్రిల్‌లో ఆకట్టుకున్నారు.
BCCI : ఆదివారమే భారత్, పాక్ మ్యాచ్.. అభిమానుల ఆగ్రహం.. బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రాక్టీస్ లో భారత జట్టును రెండు గ్రూపులుగా విభజించి మూడు లక్ష్యాలను నిర్దేశించారు. లక్ష్యాన్ని ఛేదించిన తొలి వ్యక్తి శివందూబె. అయితే.. ఆఖరికి డ్రిల్ గెలిచింది మాత్రం రింకూ సింగ్ కావడం గమనార్హం. దీంతో రింకూ సింగ్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చేతుల మీదుగా పతకాన్ని అందుకున్నాడు.