IND vs NZ : న్యూజిలాండ్‌పై భారత్ విజయం.. ఆ ఇద్దరు ప్లేయర్లపై కెప్టెన్ శ్రేయాస్ కీలక కామెంట్స్.. అద్భుతం చేశారు..!
IND vs NZ : మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ భారత జట్టు విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
Shreyas Iyer
IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం క్రైస్ట్ చర్చ్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరిగింది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్ లో చివరకు టీమిండియా నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఒకదశలో టీమిండియా ఓటమి ఖాయమని అందరూ భావించారు. కానీ, తెలుగు తేజాలు తిలక్ వర్మ (51 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (26నాటౌట్) అద్భుత పోరాటంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఖరి ఐదు ఓవర్లలో వారిద్దరూ కలిసి ఏఖంగా 68 పరుగులు సాధించారు. ఈ విజయంతో భారత 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Also Read : Arshdeep Singh : చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. తొలి భారత ప్లేయర్‌గా ఘనత
మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ భారత జట్టు విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. మాజట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడికి ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఉంది. ఆ విషయం ఈ మ్యాచ్ ద్వారా మరోసారి రుజువైందని అన్నాడు. నిజం చెప్పాలంటే వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారిందని భావించాం.. కానీ, చివరిలో తిలక్ వర్మ, నితీశ్ కుమార్ లు అద్భుతమైన పోరాటపటిమను కనబరిచి.. ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించారంటూ శ్రేయాస్ వారిద్దరిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
మరోవైపు.. నమన్ ధీర్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నమన్ ఒక అద్భుతమైన ఆల్ రౌండర్. బ్యాటుతోపాటు బంతితోనూ రాణించగలడు. అయితే, ఈ మ్యాచ్ లో లక్ష్యఛేదనలో మేము ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని భావించాం. కివీస్ బౌలర్లు అద్భుత బంతులతో బౌలింగ్ చేశారు. దీంతో పవర్ ప్లేలో ఎక్కువగా డాట్ బాల్స్ ఆడాల్సి వచ్చింది. ఫలితంగా రన్ రేటు తగ్గిపోవటంతో మాపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నించి వికెట్లు పోగొట్టుకున్నాం. దీంతో మిడిల్ ఓవర్లలో మ్యాచ్ పూర్తిగా కివీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మేము గ్యాప్ లు చూసుకొని బౌండరీలు సాధించే ప్రయత్నం చేసిఉంటే బాగుండేది. అయితే, మొత్తానికి చివరిలో విజయతీరాలకు చేరడం చాలా సంతోషంగా అనిపించింది. వచ్చే మ్యాచ్ లలో మరింత ఆటతీరును కనబర్చేందుకు మా ప్రయత్నం ఉంటుంది అంటూ శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్ లో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. ఫిలిప్స్ (70), జాకబ్స్ (58) పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి విజయం సాధించింది. భారత జట్టు బ్యాటర్లలో అభిషేక్ (27), తిలక్ వర్మ (51నాటౌట్), నమన్ (31), నితీశ్ కుమార్ (26నాటౌట్) రాణించారు.
