IND vs NZ 3rd T20 : నేడు భారత్–న్యూజిలాండ్ మూడో టీ20.. ఎక్కడ చూడాలంటే..? సూర్యవంశీకి చోటు దక్కుతుందా.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా..
IND vs NZ 3rd T20 : భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ మంగళవారం వెల్లింగ్టన్ వేదికగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
- Harish Thanniru
- Updated on- October 27, 2026 / 08:47 AM IST
IND vs NZ 3rd T20
IND vs NZ 3rd T20 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ లలో టీమిండియా వరుస విజయాలు సాధించి 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇవాళ వెల్లింగ్టన్‌లోని హెచ్‌ఎన్ఆర్వై స్టేడియం (స్కై స్టేడియం)లో జరిగే మూడో టీ20 మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు సన్నద్ధమవుతోంది. మరోవైపు.. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ తప్పక గెలవాల్సి ఉంది.
Also Read : IND vs NZ : న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్.. టీమ్ఇండియాకు భారీ షాక్..
వెల్లింగ్టన్ వేదికగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మూడో టీ20 మ్యాచ్‌ను టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆన్‌లైన్‌లో సోనీ లివ్ (SonyLIV) యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. స్ట్రీమింగ్ కోసం సబ్‌స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది.
వైభవ్ తుది జట్టులో ఉంటాడా?
ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే, తొలి మ్యాచ్ సందర్భంగా ఇషాన్ కిషన్ గాయపడంతో అతని స్థానంలో రెండో టీ20 మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చాడు. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చి పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
వాస్తవానికి గత మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చేవాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లు ఓపెనర్లుగా క్రీజులోకి రావడంతో సూర్యవంశీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. అయితే, వైభవ్‌ను ఓపెనర్‌గానే బరిలోకి దింపాలని.. సంజూను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యవంశీ ఓపెనర్‌గా క్రీజులో వస్తాడా..? లేదంటే వన్‌డౌన్‌లోనే క్రీజులోకి వస్తాడా అనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర అంశంగా మారింది. మరోవైపు.. రెండో మ్యాచ్‌లో పరుగులు రాబట్టడంలో విఫలమైన సూర్యవంశీకి ఇవాళ జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో తుది జట్టులోకి అవకాశం ఉంటుందా.. మరో ప్లేయర్‌ను తీసుకుంటారా అనే అంశంపైనా ఉత్కంఠ నెలకొంది.
భారత జట్టు అంచనా : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్
పిచ్ వాతావరణం : వెల్లింగ్టన్ లో బలమైన గాలులు వీస్తున్నాయి. కాస్త వర్షం పడింది. కానీ, మ్యాచ్‌కు వర్షం వల్ల ఆటంకం ఉండకపోవచ్చు. ఆట సందర్భంగా పవనాలు వీచే అకాశం మాత్రం ఉంది. పిచ్‌లో జీవం ఉంటుంది. పేసర్లకు అవకాశముంటుంది. ఇక్కడ జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో గెలిచిన జట్టు 164 పరుగులను కాపాడుకుంది. కానీ, ఇదే వేదికలో 216 పరుగులు చేధన కూడా నమోదైంది.
