రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్ మార్కరమ్‌ను పెవిలియన్ బాట పట్టేలా చేసింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఐదో రోజు ఆదివారం మరో మూడు వికెట్లు పడగొట్టి చేధనలో భారత్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాడు. జడేజా లంచ్ విరామానికి 8వికెట్లు నష్టపోయి 117పరుగులు సాధించారు.
27వ ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తుండగా మార్కరమ్ రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. సమయోచితంగా స్పందించి 39పరుగులకే అవుట్ చేశాడు. 395పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు గట్టి పోటీనిచ్చారు. ఆదివారం 11/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది.
నాలుగో రోజు చివరలో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే రవీంద్ర జడేజా షాకిచ్చాడు. దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 4 పరుగుల వద్ద ఓపెనర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ (4) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు దక్షిణాఫ్రికాకు టీమిండియా 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ (127: 149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. పుజారా (81: 148 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.
టీమిండియా విజయానికి పేసర్ షమీ, స్పిన్నర్ రవీంద్ర జడేజా పోటీపడి వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళింది. రవీంద్ర జడేజా షమీకి తోడవ్వడంతో దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది. 10 పరుగుల వ్యవధిలో ఓపెనర్ మార్కరమ్ (39),ఫిలిండర్ (0, మహరాజ్ (0)లను జడేజా బోల్తా కొట్టించాడు. దీంతో సఫారీలు ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అయితే ఒకే ఓవర్‌లో జడేజా మూడు వికెట్లు సాధించడం విశేషం.
That Jadeja caught and bowled is pretty ridiculous. He actually ended up making it look really easy but it’s a hell of a grab. pic.twitter.com/G0lJwTHbol
— Doc (@DocBrownCricket) October 6, 2019