Sanju Samson trade : సంజూ శాంసన్‌ను మీకిస్తాం.. అశ్విన్ వద్దుగానీ.. జడేజాతో పాటు మరోస్టార్ ఆటగాడిని ఇవ్వండి.. రాజస్థాన్ డిమాండ్ ?
తనను వదిలివేయాలని సంజూ శాంసన్ కోరగా, అందుకు రాజస్థాన్ రాయల్స్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది(Sanju Samson trade).

RR have asked CSK for Jadeja Gaikwad or Dube for Sanju Samson trade
Sanju Samson trade : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టుకు గుడ్‌బై చెప్పనున్నాడని, అతడిని తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతోందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ట్రేడ్ డీల్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఫ్రాంఛైజీలు తమ జట్లలోని ఆటగాళ్లను మార్చుకోవచ్చు. ఐపీఎల్ 2026 మినీ వేలం వరకు ఈ ట్రేడ్ డీల్ చేసుకోవచ్చు.
తనను వదిలివేయాలని సంజూ శాంసన్ కోరగా, అందుకు రాజస్థాన్ రాయల్స్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని ట్రేడ్ డీల్ (Sanju Samson trade) ద్వారా దక్కించుకునే ప్రయత్నాలను చెన్నై సూపర్ కింగ్స్ ముమ్మరం చేసిందని సమాచారం. ఈ క్రమంలో సంజూ శాంసన్‌కు బదులుగా ట్రేడ్ డీల్‌లో ఇద్దరు సీఎస్‌కే ఆటగాళ్లను ఆర్ఆర్ డిమాండ్ చేస్తోందట.
Rishabh Pant : ‘ఐ హేట్ దిస్ సో మచ్..’ సోషల్ మీడియాలో రిషబ్ పంత్ పోస్ట్..
🚨 SAMSON TRADE UPDATE. 🚨
– RR have asked CSK for Ravindra Jadeja, Ruturaj Gaikwad or Shivam Dube for Sanju Samson trade. (Cricbuzz). pic.twitter.com/3tB9eX2ahr
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 13, 2025
అశ్విన్ వద్దు గానీ..
సంజూకు బదులుగా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆర్ఆర్ అడిగినట్లు వార్తలు వచ్చాయి గానీ.. ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ ప్రకారం అశ్విన్‌ను ఆర్ఆర్ అడగలేట. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు రుతురాజ్ గైక్వాడ్ లేదా శివమ్ దూబేలలో ఒకరిని ఇవ్వాలని కోరిందట. అయితే.. ఈ డీల్ చేసుకునేందుకు సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఒప్పుకోలేదని నివేదిక పేర్కొంది.
సంజూ శాంసన్‌కు బదులుగా నగదు ఇస్తాం గానీ, తమ జట్టులోని ఏ ఒక్క ఆటగాడిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు రాజస్థాన్‌కు సీఎస్‌కే స్పష్టం చేసిందట. ఒకవేళ ట్రేడ్ డీల్ ద్వారా శాంసన్‌ను చెన్నై సొంతం చేసుకోలేకపోతే మినీ వేలంలో అతడి కోసం పోటీపడడం మినహా ఆ జట్టు దగ్గర మరో మార్గం లేదు. అయితే.. ఐపీఎల్ 2026 మినీ వేలం కన్నా ముందు శాంసన్ కోసం మరో జట్టు ఏదైనా రాజస్థాన్‌తో ట్రేడ్ డీల్ చేసుకుంటే అప్పుడు సీఎస్‌కేకు నిరాశ తప్పదు.
ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ కు గనుక సంజూ శాంసన్‌ను వదిలివేయడం ఇష్టం లేకుంటే.. నిబంధనల ప్రకారం ఐపీఎల్ 2027 సీజన్ వరకు అతడు ఆ జట్టుతోనే కొనసాగాల్సి ఉంటుంది.