Arjun Tendulkar engagement : సానియాతో అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్‌మెంట్..! ఎవరీ సానియా చందోక్ ? వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తోంది (Arjun Tendulkar engagement).

Arjun Tendulkar engagement
Arjun Tendulkar engagement : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తోంది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar ) త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నట్లు సమాచారం.
ముంబైకి చెందిన సానియా చందోక్(Saniya Chandok)తో అర్జున్‌కు నిశ్చితార్థం (Arjun Tendulkar engagement) జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబాలు, అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల మధ్య సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే..ఈ వేడుకకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.
ఎవరీ సానియా చందోక్..
ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు సానియా చందోక్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడుయేషన్ పూర్తి చేసింది. ప్రముఖ పెట్ కేర్ బ్రాండ్ అయిన Mr. Paws Pet Spa & Store LLPకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తుంది. ఆమె తాత రవి ఘాయ్ కుటుంబానికి ఆతిథ్య, ఆహార రంగాల్లో పలు బిజినెస్‌లు ఉన్నాయి. ఇంటర్ కాంటినెంటల్ హోటల్, ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీలతో పాటు పలు వ్యాపారాలు ఉన్నాయి.
అర్జున్ విషయానికి వస్తే..
తండ్రి అడుగుజాడల్లో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు అర్జున్ టెండూల్కర్. అయితే.. భారత జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈ ఎడమ చేతి వాటం పేసర్ దేశవాళీ క్రికెట్‌లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇప్పటి వరకు 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీశాడు. అంతేకాదండోయ్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. 532 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల విషయానికి వస్తే.. 24 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీశాడు. 119 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.