India vs Sri Lanka 1st Test : మానవ్ సుతార్ మ్యాజిక్.. శ్రీలంకపై భారత్ ఘన విజయం..
India vs Sri Lanka 1st Test : శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.
- Harish Thanniru
- Updated on- August 19, 2026 / 02:27 PM IST
India vs Sri Lanka 1st Test
India vs Sri Lanka 1st Test : శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత జట్టు 165 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 462 పరుగులు చేసింది. శ్రీలంక 284 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 193 పరుగులు చేసి.. శ్రీలంక జట్టుకు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, లంక బ్యాటర్లు లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు. కేవలం 206 పరుగులు మాత్రమే చేయగలిగారు.
శ్రీలంక జట్టు ఓటమిలో టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక భూమిక పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు పడగొట్టిన సుతార్.. రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టాడు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 10 వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటర్లు భారీ పరుగులు చేయకుండా తన స్పిన్ మాయాజాలంతో అడ్డుకట్ట వేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ శతకం (167)తో చెలరేగడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేశాడు.
A clinical victory for #TeamIndia in the Galle Test.
Manav Suthar’s 6 wicket haul in the second innings, guides India to a 165 run win over Sri Lanka.
Scorecard – https://t.co/M9LVyCAp8y #SLvIND pic.twitter.com/QxAhFQGZke
— BCCI (@BCCI) August 19, 2026
