IND vs SL : నేటి నుంచి భార‌త్ వ‌ర్సెస్ శ్రీలంక వార్మ‌ప్ మ్యాచ్‌.. 11 కాదు 15 మంది బ్యాటింగ్ చేయొచ్చు.. రూల్స్ చాలా డిఫ‌రెంట్‌

నేటి (శుక్ర‌వారం) నుంచి భార‌త జ‌ట్టు శ్రీలంక ఎలెవ‌న్‌తో (IND vs SL) మూడు రోజుల వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది.

India vs sri lanka xi warm up match today do you know the rules

IND vs SL : భార‌త్‌, శ్రీలంక జ‌ట్లు ఆగ‌స్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ సిరీస్ క‌న్నా ముందు నేటి (శుక్ర‌వారం) నుంచి భార‌త జ‌ట్టు శ్రీలంక ఎలెవ‌న్‌తో మూడు రోజుల వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది. కొలంబోలోని నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. లంక వాతావ‌ర‌ణం, పిచ్ కండిష‌న్లకు భార‌త ఆట‌గాళ్లు అల‌వాటు ప‌డేందుకు ఈ మ్యాచ్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ మ్యాచ్ టీవీల్లో కూడా టెలికాస్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్స్‌లో ఈ మ్యాచ్‌ను వీక్షించ‌వ‌చ్చు.

వార్మప్ మ్యాచ్‌ల నిబంధనలు ఎలా ఉంటాయి?

అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌తో పోలిస్తే ఇలాంటి వార్మ‌ప్ మ్యాచ్‌ల నిబంధ‌న‌లు కాస్త భిన్నంగా ఉంటాయి.

* కెప్టెన్ తప్పనిసరిగా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాల్సిన అవసరం లేదు.
* జట్టులోని అందరూ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే 15 మంది కూడా బ్యాటింగ్‌కు రావచ్చు.
* జ‌ట్టులోని 15 మంది ఆట‌గాళ్ల‌తో కెప్టెన్ బౌలింగ్ చేయించుకునే అవ‌కాశం ఉంది.
* ఔట్ అయిన బ్యాటర్‌ను అవసరమైతే మళ్లీ బ్యాటింగ్‌కు పంపవచ్చు.
* కొన్నిసార్లు బ్యాటర్ ఔట్ కాకపోయినా, అతనికి తగినంత ప్రాక్టీస్ లభించిందని భావిస్తే లేదా ఇత‌ర ప్లేయ‌ర్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని అనుకుంటే ఔట్ కాకుండానే రిటైర్డ్ హ‌ర్ట్ పెవిలియ‌న్‌కు వెళ్ల‌వ‌చ్చు.
* ఈ మ్యాచ్‌లో చేసిన పరుగులు, వికెట్లు రికార్డుల్లో చేరవు

Women Asia Cup 2026 : మహిళల ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుద‌ల‌.. భార‌త్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

వార్మప్ మ్యాచ్‌లో ఆటగాడు ఎంత పెద్ద స్కోరు చేసినా లేదా ఎన్ని వికెట్లు తీసుకున్నా అవి అధికారిక గణాంకాల్లో నమోదు కావు. శతకం, హ్యాట్రిక్ వంటి ప్రదర్శనలు కూడా రికార్డు పుస్తకాల్లో చేరవు. అలాగే ఈ మ్యాచ్‌లు అధికారిక మ్యాచ్‌ల సంఖ్యలో లెక్కించబడవు. ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌పై కూడా ఎలాంటి ప్రభావం ఉండదు.

పిచ్, బంతి మాత్రం అధికారిక మ్యాచ్‌ల మాదిరిగానే..

వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ పిచ్‌ను అంతర్జాతీయ మ్యాచ్‌ల మాదిరిగానే సిద్ధం చేస్తారు. మైదానం కూడా అన్ని ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తారు. ఆటగాళ్ల భద్రతకు పూర్తి ప్రాధాన్యం ఇస్తారు. ఉపయోగించే బంతి కూడా అధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లో వాడే బంతే ఉంటుంది. నోబాల్, ఫోర్, సిక్స్, ఎల్బీడబ్ల్యూ మొద‌లైన ప్రాథ‌మిక నిబంధ‌న‌లు అమల్లో ఉంటాయి