India Vs West Indies : భారత్-వెస్టిండీస్ తొలి వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే
India vs West Indies : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డేలో భాగంగా భారత జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
- Harish Thanniru
- Published on- September 27, 2026 / 02:12 PM IST
India Vs West Indies
India Vs West Indies : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే తిరువనంతపురం వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో అందరి కళ్లు వారిపైనే ఉన్నాయి. మరోవైపు.. ఈ మ్యాచ్ తో నమన్ ధీర్ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు.
భారత్ జట్టు ఇదే..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, నమన్ ధీర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్, గుర్నూర్ బ్రార్, కుల్‌దీప్, ప్రసిధ్ కృష్ణ
వెస్టిండీస్ జట్టు ఇదే..
జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్టీ, షై హోప్, అమిర్ జంగూ, జెవెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, గుడాకేశ్ మోటీ, అల్జారి జోసెఫ్, జేడెన్ సీల్స్
