Deepak Chahar : కొత్త తరహా మోసం బారిన పడ్డ టీమిండియా పేసర్.. క్షమాపణలు చెప్పిన జొమాటో
టీమ్ఇండియా పేసర్ దీపర్ చాహర్ కు చేదు అనుభవం ఎదురైంది.
- Thota Vamshi Kumar
- Updated on- February 25, 2024 / 01:18 PM IST
Deepak Chahar
Deepak Chahar : టీమ్ఇండియా పేసర్ దీపర్ చాహర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆన్లైన్లో అతడు ఆర్డర్ చేసిన ఫుడ్ రాలేదు సరికదా డెలివరీ అయినట్లు మెసెజ్ వచ్చింది. అదే విషయమై అతడు సదరు సంస్థ కస్టమర్ కేర్ ను సంప్రదించగా ఫుడ్ డెలివరీ అయినట్లు చెప్పింది. దీంతో తాను అబద్దాలు ఆడుతున్నట్లుగా వారు మాట్లాడినట్లు దీపక్ ఆరోపించాడు. ఇండియాలో కొత్త మోసం జరిగిందంటూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీపక్ చాహర్ శనివారం ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అయిన జొమాటోలో ఫుడ్‌ను ఆర్డర్ చేశాడు. ఎంత సేపటికి ఆర్డర్ చేసిన ఆహారం రాలేదు. అంతేకాదు.. డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ విషయమై కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే.. వారు అదే విషయం చెప్పారు. తాను అబద్దాలు ఆడుతున్నట్లుగా అన్నారు. తనలాగే ఎంతో మంది ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. మీ స్టోరీలను జొమాటోకు ట్యాగ్ చేయండి అంటూ దీపక్ చాహర్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు.
దీనిపై జొమాటో స్పందించింది. ‘క్షమాపణలు కోరింది. హాయ్ దీపక్. మీకు ఎదురైన అనుభవానికి మేము తీవ్రంగా చిందిస్తున్నాము. కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాము. ఇలాంటి సమస్యలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిశీలిస్తున్నాము.’ అని జొమాటో తెలిపింది.
దీనిపై చాహర్ మాట్లాడుతూ.. ‘చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆర్డర్ చేసిన డబ్బును వాపస్ చేయడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. డబ్బుతో ఆకలిని భర్తీ చేయలేము.’ అని అన్నాడు.
చాహర్ వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ జొమాటో మరోసారి ఇలా సమాధానమిచ్చింది.. ‘దీపక్.. మేము మీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నాము. సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నాము. మీ సంతృప్తి మాకు చాలా ముఖ్యం. దయచేసి మా బృందం కనెక్ట్ కావడానికి కొంత సమయం ఇవ్వండి. దీని గురించి చర్చించండి’ అని అనింది.
