Olympic Games 2028 : ఒలింపిక్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడడం అసాధ్యం..? సూర్యకుమార్, పాండ్యలు కష్టమేనా..?
ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ప్రతీ క్రీడాకారుడు కోరుకుంటారు. ఇటీవలే ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగమైంది. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : October 17, 2023 / 07:58 PM IST
Indian Star players may not be part of Olympics 2028
Olympic Games : ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ప్రతీ క్రీడాకారుడు కోరుకుంటారు. ఇటీవలే ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగమైంది. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు. అయితే.. ఈ పోటీల్లో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు అయిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు ఆడే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి.
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ.. ఆ పోస్టర్‌లో క్రికెట్‌కు విరాట్ కోహ్లీనే గుర్తుగా పెట్టింది. అయితే.. ఈ పరుగుల యంత్రం ఒలింపిక్స్‌లో ఆడతాడా ..? అనే సందేహం ఇప్పుడు నెలకొంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయసు 34 సంవత్సరాలు. ఒలింపిక్స్ 2028లో జరగనుంది. ఆ సమయానికి విరాట్ కోహ్లీకి 38 ఏళ్లు దాటుతాయి. అప్పటి వరకు విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతాడా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఫిట్‌నెస్‌కు మారు పేరైన విరాట్ కోహ్లీ అప్పటి వరకు తన కెరీర్‌ను కొనసాగించినప్పటికీ కుర్రాళ్ల ఆటైన టీ20 ఫార్మాట్‌లో ఆడతాడా..? అన్నది సందేహమే. అటు రోహిత్ శర్మ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇప్పుడు రోహిత్ వయసు 36 ఏళ్లు.. ఒలింపిక్స్ నాటికి అతడికి 41 ఏళ్లు ఉంటాయి. అదే విధంగా ఒలింపిక్స్ సమయానికి సూర్యకుమార్ యాదవ్‌కు 37 ఏళ్లు, పాండ్యకు 34 ఏళ్లు, రవీంద్ర జడేజాకు 38 ఏళ్లు వస్తాయి. వీరిలో అప్పటి వరకు ఎందరు తమ కెరీర్‌ను కొనసాగిస్తారో చెప్పలేము. ఒకవేళ కొనసాగించిన బీజీ షెడ్యూల్ వల్ల కొన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.
శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ వంటి కుర్రాళ్లు ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అయితే.. అప్పటి వీరిలో ఎందురు జట్టులో కొనసాగుతారో..? ఎందరు లాస్ఏంజిల్స్ విమానం ఎక్కుతారో చూడాలి మరీ..?
ఇప్పుడున్న కొందరు స్టార్ ఆటగాళ్లు వయసు 2028 ఒలింపిక్స్ సమయానికి ఎంతంటే..?
– రోహిత్ శర్మ 41 సంవత్సరాలు
– విరాట్ కోహ్లీ 38 సంవత్సరాలు
– రవీంద్ర జడేజా – 38 సంవత్సరాలు.
– సూర్యకుమార్ యాదవ్ 37 సంవత్సరాలు
– హార్దిక్ పాండ్యా 34 సంవత్సరాలు
ODI World Cup : నీకు ఎలా ఆడాలో మీ నాన్న నేర్పించలేదా..? మార్ష్‌ను ప్రశ్నించిన గవాస్కర్..
– జస్ప్రీత్ బుమ్రా 33 సంవత్సరాలు
– మహ్మద్ సిరాజ్ 33 సంవత్సరాలు
– రిషబ్ పంత్ 30 సంవత్సరాలు
– శుభ్‌మన్ గిల్ 28 సంవత్సరాలు
– తిలక్ వర్మ 24 సంవత్సరాలు
