Indian system: ఇండియన్ సిస్టమ్ చాలా బెటర్ – పాక్ మాజీ క్రికెటర్

ఇండియన్ సిస్టమ్ చాలా బెటర్ అని పొగిడేస్తున్నాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ అబ్దుర్ రెహమాన్. ఇండియాలో నిర్వహించే దేశీవాలీ క్రికెట్ వారి సక్సెస్ లో భాగం అని రెహమాన్ పొగిడేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇండియన్ సిస్టమ్ చూసి నేర్చోకోవాలని

Pak Former Cricketer

Indian system: ఇండియన్ సిస్టమ్ చాలా బెటర్ అని పొగిడేస్తున్నాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ అబ్దుర్ రెహమాన్. ఇండియాలో నిర్వహించే దేశీవాలీ క్రికెట్ వారి సక్సెస్ లో భాగం అని రెహమాన్ పొగిడేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇండియన్ సిస్టమ్ చూసి నేర్చోకోవాలని అలా తమ దేశంలోనూ క్రికెట్ ను మెరుగుపరచుకోవాలని సూచించారు.

క్రికెట్ పాకిస్తాన్ అనే ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అబ్దుర్ రెహమాన్ బీసీసీఐ ప్రవర్తనా తీరుపై పొగడ్తల వర్షం కురిపించారు.

‘ఇండియన్ సిస్టమ్ పాకిస్తాన్ కంటే చాలా బెటర్. దేశీవాలీ క్రికెట్ లో వారి లెవల్ చాలా ఉన్నతంగా ఉంది. ప్లేయర్లతో వారు చూపించే ఔన్నత్యం చాలా బాగుంటుంది. వాళ్ల దేశీవాలీ క్రికెట్ కు కూడా ఒక స్టాండర్డ్ఉంటుంది. అలాగే ప్లేయర్లను కూడా ట్రీట్ చేస్తారు. ప్లేయర్ల మ్యాచ్ ఫీజులు, వారితో కాంట్రాక్టులు కూడా గొప్పగా ఉంటాయి’ అని రెహమాన్ అన్నాడు.

ఇండియాలో ట్రీట్ చేసినంత గొప్పగా పాకిస్తాన్ లో దేశీవాలీ క్రికెట్ కు ఆదరణ ఉండదు. మన దేశీవాలీ క్రికెట్ కూడా వృద్ధి చెందాలని అనుకుంటున్నా. ఇప్పటి వరకూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. దేశీ వాలీ క్రికెట్‌కు బదులు పాకిస్తాన్ సూపర్ లీగ్ మీద మాత్రమే డిపెండ్ అయి ప్లేయర్లను ఎంచుకుంటుంది. సంవత్సరమంతా పలు అకాడమీల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న ప్లేయర్ల సంగతేంటి.. వాళ్లెక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు అబ్దుర్ రెహమాన్.