IPL 2021: ఐపీఎల్ కొత్త రూల్.. బ్యాట్స్‌మెన్‌కు మాత్రమే కలిసొస్తుందా..!

కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ ను పునరుద్ధరించే సన్నాహాల్లో పడింది బీసీసీఐ. ఇప్పటికే తేదీలతో సహా ప్రకటించినా.. కొత్త రూల్ వచ్చి బౌలర్లకు షాక్ ఇచ్చింది. ఇంకా జరగాల్సి ఉన్న 31మ్యాచ్ లకు ఇదే రూల్ ఫాలో అవనున్నారు.

Ipl 2021

IPL 2021: కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ ను పునరుద్ధరించే సన్నాహాల్లో పడింది బీసీసీఐ. ఇప్పటికే తేదీలతో సహా ప్రకటించినా.. కొత్త రూల్ వచ్చి బౌలర్లకు షాక్ ఇచ్చింది. ఇంకా జరగాల్సి ఉన్న 31మ్యాచ్ లకు ఇదే రూల్ ఫాలో అవనున్నారు. యూఏఈ వేదికగా జరిగే రెండో దశ మ్యాచ్ లలో కరోనా దరిచేరకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ సెకండాఫ్‌ లో సరికొత్త రూల్‌ ఇలా ఉంది. బాట్స్‌మన్ బాదిన బంతి స్టాండ్స్‌లో పడితే తిరిగి ఉపయోగించకూడదనే రూల్ తీసుకొచ్చారు. మైదానం ఆవల పడే బంతులను ఇతరులు తాకే అవకాశం ఉంటుంది. అదే బంతిని వాడితే కరోనాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ఆ బంతిని వదలేసి దాని స్థానంలో కొత్త బంతిని వినియోగించాలని బీసీసీఐ ప్రతిపాదించింది.

ఐపీఎల్‌ సెకండాఫ్ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఎంట్రీ ఉంటున్నందున ఈ కొత్త రూల్ తీసుకొచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్‌ బౌలర్లకు ఇబ్బంది కానీ, బ్యాట్స్‌మెన్లకు కలిసొస్తుంది.

కొత్తబంతి హార్డ్‌గా ఉంటూ బ్యాట్‌పైకి సులువుగా వస్తుంది. స్పిన్ కు సహకరించే యూఏఈ పిచ్‌లలో బౌలింగ్ కాస్త ఇబ్బందే. ఇక ఈ నిబంధనతో కొత్త బంతి వచ్చిన ప్రతీసారి బౌలర్లు దానికి అనుగుణంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బంతిపై పట్టుచిక్కకుండా బ్యాట్స్‌మెన్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంది. బంతి మారిందంటే బ్యాట్స్‌మన్ ను ఆపడానికి నానా తంటాలు పడటం ఖాయం.