IPL 2022: రెడీ.. మిస్సైల్ షాట్‌లు దూసుకొస్తున్నాయ్
అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ కు సర్వం ముస్తాబైంది. మరికొద్ది రోజుల్లో అంటే మార్చి 26 నుంచి జరగనున్న ఐపీఎల్ 2022వ సీజన్‌కు స్టార్ బ్యాట్స్‌మెన్ పక్కా ప్లానింగ్‌తో..
- Subhan Ali Shaik
- Published On : March 22, 2022 / 11:00 AM IST
Ipl 2022
IPL 2022: అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ కు సర్వం ముస్తాబైంది. మరికొద్ది రోజుల్లో అంటే మార్చి 26 నుంచి జరగనున్న ఐపీఎల్ 2022వ సీజన్‌కు స్టార్ బ్యాట్స్‌మెన్ పక్కా ప్లానింగ్‌తో ప్రాక్టీస్ చేస్తున్నారు. మే29 వరకూ షార్ట్ క్రికెట్ ఫార్మాట్ అభిమానులకు కనువిందు చేయనుంది బడా టోర్నమెంట్. ఈ క్రమంలో అభిమానుల ఆశలన్నీ తమ అభిమాన ప్లేయర్ల మీదే ఉన్నాయి.
భయమనేదే లేకుండా చెలరేగే కోహ్లీ.
బంతిని బాదేందుకు వెనకాడని రోహిత్ శర్మ.
నిరంతరాయంగా దూసుకెళ్లే.. ప్రొలిఫిక్ రన్ స్కోరర్ కేఎల్ రాహుల్.
ఐపీఎల్ అంటేనే చెలరేగిపోయే వార్నర్.. ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ.
హద్దులు చెలరేగి రెచ్చిపోయే ఆండ్రీ రస్సెల్
