IPL 2026 : ఐపీఎల్ 2026ను వెంటాడుతున్న భారీ గండం.. రూ. 57 కోట్ల నష్టం.. ఒకే దెబ్బకు 10 జట్లు విలవిల!

IPL 2026 : ఈ సీజన్ ఐపీఎల్ లో 10 జట్లును ఒకే సమస్య ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇంతకు ఆ సమస్య ఏంటంటే..

ipl 2026 10 Teams Are Impacted By A Single Issue it cost Rs 57 6 Crore is injured and players not available

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో 50 మ్యాచ్‌ల మైలురాయిని దాటేసరికి.. క్రికెట్ కంటే ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం ఆటగాళ్ల గాయాలు, కీలక క్రికెటర్ల గైర్హాజరీ. ఈ సీజన్‌లో వివిధ జట్లు భారీ మొత్తాలు వెచ్చించి కొనుగోలు చేసిన పలువురు స్టార్ ఆటగాళ్లు పూర్తిగా లేదా కొన్ని రోజుల పాటు టోర్నీకి దూరమయ్యారు. ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సీజన్‌లో అందుబాటులో లేని ఆటగాళ్ల విలువ సుమారు రూ. 57.6 కోట్లకు చేరడం విశేషం. ఈ ఏడాది వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా రూ. 64.30 కోట్ల పర్సుతో బరిలోకి దిగింది. అంటే గైర్హాజరైన ఆటగాళ్ల వల్ల కలిగిన నష్టం.. దాదాపు ఒక జట్టు వేలం బడ్జెట్‌కు సమానం.

కీలక జట్లు – ఎదుర్కొంటున్న సవాళ్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR):

2024 ఛాంపియన్లకు ఈ సీజన్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వేలంలో భారీ ధర పలికిన మతీష పతిరణ (రూ. 18 కోట్లు) ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరో కీలక బౌలర్ హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు) మోకాలి శస్త్రచికిత్స కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

రాజస్థాన్ రాయల్స్ (RR):

సీఎస్కే నుంచి ట్రేడింగ్ ద్వారా భారీ అంచనాలతో వచ్చిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ గాయం కారణంగా తప్పుకోవడం రాజస్థాన్‌ రాయల్స్ జట్టుకు భారీ మొత్తంలో నష్టాన్నే మిగిల్చింది.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK):

చెన్నై సూపర్ కింగ్స్‌ను కూడా ఈ సమస్య వేధిస్తోంది. ఈ సీజన్‌లో నాణ్యమైన పేసర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ లతో పాటు వర్ధమాన ఆటగాడు ఆయుష్ మ్హత్రే సేవలను కోల్పోవడంతో సీఎస్కే తన జట్టు కూర్పులో తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

ముంబై ఇండియన్స్ (MI):

ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోంది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం వల్ల కొన్ని కీలక మ్యాచ్‌లకు దూరం కాగా.. మిచెల్ సాంట్నర్ భుజం గాయంతో టోర్నీ నుంచే వైదొలిగాడు. విల్ జాక్స్ కూడా చాలా ఆలస్యంగా జట్టులో చేరాడు.

ఆస్ట్రేలియా ప్లేయర్ల ‘వర్క్ లోడ్’ సమస్య:

దీనికి తోడు ఆస్ట్రేలియా క్రికెటర్ల లభ్యత కూడా ఫ్రాంచైజీలకు పెద్ద తలనొప్పిగా మారింది. మిచెల్ స్టార్క్ (ఢిల్లీ క్యాపిటల్స్), జోష్ హేజిల్‌వుడ్ (ఆర్సీబీ) వంటి స్టార్లు ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేరు. ఇక కామెరూన్ గ్రీన్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా పనిభారం దృష్ట్యా ఆయన బౌలింగ్‌పై ఆంక్షలు విధించింది. ఇది కూడా జట్లపై భారం పెంచుతోంది.

మొత్తంగా దూరమైన ఆటగాళ్ల విలువల జాబితా:

  • మతీష పతిరణ: రూ. 18 కోట్లు
  • ముస్తాఫిజుర్ రెహమాన్: రూ. 9.2 కోట్లు
  • ఖలీల్ అహ్మద్: రూ. 4.8 కోట్లు
  • హర్షిత్ రాణా: రూ. 4 కోట్లు
  • జాక్ ఎడ్వర్డ్స్: రూ. 3 కోట్లు
  • సామ్ కరన్: రూ. 2.4 కోట్లు
  • నాథన్ ఎల్లిస్: రూ. 2 కోట్లు
  • వానిందు హసరంగ: రూ. 2 కోట్లు
  • టామ్ బాంటన్: రూ. 2 కోట్లు
  • మిచెల్ సాంట్నర్: రూ. 2 కోట్లు
  • బెన్ డకెట్: రూ. 2 కోట్లు
  • మాథ్యూ షార్ట్: రూ. 1.5 కోట్లు
  • డేవిడ్ పేన్: రూ. 1.5 కోట్లు
  • ఆకాష్ దీప్: రూ. 1 కోటి
  • బ్రైడన్ కార్స్: రూ. 1 కోటి
  • అథర్వ అంకోలేకర్: రూ. 30 లక్షలు
  • పృథ్వీరాజ్ యర్రా: రూ. 30 లక్షలు
  • ఆయుష్ మ్హత్రే: రూ. 30 లక్షలు
  • రామకృష్ణ ఘోష్: రూ. 30 లక్షలు

కొందరు ఆటగాళ్లు గాయాల వల్ల దూరమైతే.. మరికొందరు ఇతర కారణాలతో దూరమయ్యారు. ఉదాహరణకు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ రూ. 9.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఫ్రాంచైజీ అతడిని విడుదల చేసింది. మరోవైపు, ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ టెస్ట్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలని భావించి, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడకుండా టోర్నీ నుండి తప్పుకున్నాడు.