Virat Kohli : కోహ్లీనే బోల్తా కొట్టించిన 36 ఏళ్ల స్వింగ్ సుల్తాన్.. ఆర్సీబీకి ఇక నువ్వే దిక్కుసామీ..
ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రాక్టీస్‌లో చమటోడ్చుతున్నాడు.
IPL 2026 Bhuvneshwar Kumar bowled Virat kohli with terrific yorker in practice
Virat Kohli : మరో ఎనిమిది రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం కానుంది. ఈ మెగాటోర్నీలో విజయం సాధించేందుకు ఇప్పటికే అన్ని జట్లు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఆర్సీబీ జట్టు ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఆర్సీబీ ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సైతం ప్రాక్టీస్‌లో చమటోడ్చుతున్నాడు. తాజాగా కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కోహ్లీని ఓ చక్కటి యార్కర్‌తో 36 ఏళ్లు భువనేశ్వర్ కుమార్ బోల్తా కొట్టించాడు. భువీ వేసిన యార్కర్‌కు కోహ్లీ వద్ద సమాధానం లేకపోయింది. బంతి లెగ్ స్టంప్ ను ముద్దాడింది.
NZ vs SA : దంచికొట్టిన టామ్ లాథమ్.. మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
This yorker from Bhuvneshwar Kumar completely beat Virat Kohli.🫡
In the last two years, Bhuvneshwar Kumar’s name has gone a bit down, but maybe in this IPL he will definitely do something special.🙌 pic.twitter.com/L0bF9BsR0Z
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 19, 2026
ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ నిలవడంలో విరాట్ కోహ్లీతో పాటు భువనేశ్వర్ కుమార్‌లు కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ బ్యాటింగ్‌లో చెలరేగి 15 ఇన్నింగ్స్‌ల్లో 657 పరుగులు సాధించాడు. ఇక భువనేశ్వర్ కుమార్ 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ భువనేశ్వర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
SRH : అయ్యో.. కావ్య పాపకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ ఆసీస్ ఆటగాళ్లు ఉన్నారే..
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా ఈ సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ క్రమంలో ఆర్స్బీ బౌలింగ్ భారమంతా భువనేశ్వర్ కుమార్ పైనే ఉంది. ఈ సీజన్లోనూ భువీ చక్కగా రాణించాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
