IPL 2026 : పక్షిలా గాల్లోకి ఎగిరి.. బాబోయ్.. ఏం పట్టేశావ్ బాసూ.. సర్ఫరాజ్ ఖాన్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
IPL 2026 : సీఎస్‌కే ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్‌లో సత్తా చాటాడు. పక్షిలా గాల్లోకి ఎగిరి అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
- Harishth Thanniru
- Published On : April 12, 2026 / 09:16 AM IST
sarfaraz khan stunning catch
- డీసీపై సీఎస్‌కే జట్టు విజయం
- సీఎస్‌కే ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుత క్యాచ్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
IPL 2026 : ఐపీఎల్ -2026లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే జట్టు విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన సీఎస్‌కే జట్టు ఎట్టకేలకు ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్‌లో సత్తా చాటాడు. పక్షిలా గాల్లోకి ఎగిరి అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్‌లో అక్షర్‌పటేల్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. సర్ఫరాజ్ ఖాన్ డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సర్ఫరాజ్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Worthy of watching on loooop! ➰
🎥 Sarfaraz Khan with a 𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 of a grab 🫴
Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC | @ChennaiIPL pic.twitter.com/ve2q6V6a5z
— IndianPremierLeague (@IPL) April 11, 2026
చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే జట్టు నిర్ణీత 20ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేసింది. ఇందులో సంజూ శాంసన్ 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్ జట్టు 20ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది.
