CSK vs KKR : జ‌ట్టులో భారీ మార్పులు త‌ప్ప‌దు.. సీఎస్‌కే పై ఓట‌మితో అజింక్యా ర‌హానేకు జ్ఞానోద‌యం..!

మంగ‌ళ‌వారం చెన్నైలోని చెపాక్ మైదానంలో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై 32 ప‌రుగులు తేడాతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ (CSK vs KKR)ప‌రాజ‌యం పాలైంది.

IPL 2026 CSK vs KKR Ajinkya Rahane comments after Kolkata Knight Riders lost match to Chennai Super Kings

  • ఐపీఎల్ 2026లో ఇంత వ‌ర‌కు గెలుపు బోణీ కొట్ట‌ని కేకేఆర్‌
  • మంగ‌ళ‌వారం సీఎస్‌కే చేతిలో ఓట‌మి
  • ఇక జ‌ట్టులో భారీ మార్పులు త‌ప్ప‌వ‌న్న అజింక్యా ర‌హానే

CSK vs KKR : ఐపీఎల్ 2026లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు గెలుపు అంద‌ని ద్రాక్ష‌గా మారింది. మంగ‌ళ‌వారం చెన్నైలోని చెపాక్ మైదానంలో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై 32 ప‌రుగులు తేడాతో ప‌రాజ‌యం పాలైంది. బ్యాట‌ర్ల వైఫ‌ల్యమే త‌మ ఓట‌మికి కార‌ణం అని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా ర‌హానే తెలిపాడు.

సంజూశాంస‌న్ (48; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (41; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఆయుష్ మాత్రే (38; 17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో కార్తిక్ త్యాగి రెండు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

అనంత‌రం 193 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో ర‌మ‌ణ్‌దీప్ సింగ్ (35; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), రోవ్‌మన్ పావెల్ (31; 22 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) రాణించారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ మూడు వికెట్లు తీశాడు. అన్షుల్ కంబోజ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఖలీల్ అహ్మద్, అకీల్ హోసేన్ లు చెరో వికెట్ సాధించారు.

Also read : ఇషాన్ కిష‌న్ బ్యాట్‌ను గ‌మ‌నించారా? వ‌ద్ద‌న్నాడా? ఒప్పందం ముగిసిందా?

ఈ మ్యాచ్‌లో ఓడిపోవ‌డం త‌మ‌ను నిరాశ ప‌రిచింద‌ని కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్ అజింక్యా ర‌హానే తెలిపాడు. బ్యాట‌ర్ల వైఫ‌ల్యం కార‌ణంగానే ఓడిపోయామ‌న్నాడు. నిజం చెప్పాలంటే ఇది ఒక మంచి పిచ్ అని అన్నాడు. బ్యాట‌ర్ల‌కు బౌల‌ర్ల‌కు ఇద్ద‌రికి స‌హ‌క‌రించింద‌న్నాడు. ప‌వ‌ర్ ప్లేలో 70 ప‌రుగులు చేసిన చెన్నైను 190 ప‌రుగుల‌కే ప‌రిమితం చేయ‌డం ప‌ట్ల స్పందిస్తూ త‌మ బౌల‌ర్లు అద్భుతంగా పుంజుకున్నార‌న్నాడు.

మార్పులు త‌ప్ప‌వు

త‌మ బ్యాట‌ర్లు ప‌వ‌ర్ ప్లేలో క‌నీసం 40 ప‌రుగులు కూడా చేయ‌లేక‌పోయార‌న్నాడు. మ్యాచ్‌లో ఇదే ట‌ర్నింగ్ పాయింట్‌గా చెప్పుకొచ్చాడు. ఇక మ‌ధ్య ఓవ‌ర్ల‌లో స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కొన‌డం కొంచెం స‌వాల్‌గా మారింద‌న్నాడు. పిచ్ బాగానే ఉంద‌ని, ఎవ‌రో ఒక‌రు బాధ్య‌త తీసుకుని ఇన్నింగ్స్ చివ‌రి వ‌ర‌కు నిలిచి మ్యాచ్ ను గెలిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు.

ALSO READ : టీమ్ఇండియాలోకి వైభ‌వ్ సూర్యవంశీ..! ఆ సిరీస్‌తోనేనా! స‌చిన్ రికార్డు క‌నుమ‌రుగేనా!

పేస‌ర్ కార్తీక్ త్యాగి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అత‌డు నెట్స్‌లో ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని అన్నాడు. అత‌డు బౌలింగ్ చేస్తున్న విధానం ప‌ట్ల అంతా సంతోషంగా ఉన్నామ‌ని చెప్పుకొచ్చాడు. ఇరు జ‌ట్ల‌లోని స్పిన్న‌ర్లు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశార‌ని చెప్పుకొచ్చాడు.

‘ఈ సీజ‌న్‌లో ఏదీ క‌లిసి రావ‌డం లేదు. వ‌రుస‌గా మ్యాచ్‌ల‌ను ఓడిపోతున్నాము. ఇది నిరాశ‌కు గురి చేస్తోంది. అయితే.. ఇలాంటి స‌మ‌యాల్లో ఓ జ‌ట్టుగా మేమంతా సానుకూలంగా ఉండ‌డం ఎంతో ముఖ్యం. ఆట‌పై మ‌రింత శ్ర‌ద్ధ పెడ‌తాం. జ‌ట్టు కూర్పు విష‌యంపై మ‌రోసారి ఆలోచ‌న చేయ‌క త‌ప్ప‌డం లేదు. ఫలితాలు అనుకూలంగా వ‌స్తుంటే ఆట‌గాళ్ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వొచ్చు. అయితే.. ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌స్తున్న‌ప్పుడు మాత్రం మార్పులు చేయ‌క త‌ప్ప‌దు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా సానుకూలంగా ఉంటూ ధైర్యంగా ముందుకు సాగ‌డ‌మే ముఖ్యం.’ అని ర‌హానే అన్నాడు.