DC vs GT : ఏదో అదృష్ట‌వ‌శాత్తు గెలిచాం.. నా త‌ప్పుల వ‌ల్ల ఓడిపోవాల్సింది.. శుభ్‌మ‌న్ గిల్ హాట్ కామెంట్స్‌..

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో (DC vs GT) గుజ‌రాత్ టైటాన్స్ ఒక్క ప‌రుగు తేడాతో గెలుపొందింది.

IPL 2026 DC vs GT Shubman Gill key Comments after Gujarat Titans win by 1 run against Delhi Capitals (pic credit@IPL)

  • ఈ సీజ‌న్‌లో గెలుపు బోణీ కొట్టిన గుజ‌రాత్ టైటాన్స్‌
  • ఒక్క ప‌రుగు తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై విజ‌యం
  • ఆనందాన్ని వ్య‌క్తం చేసిన శుభ్‌మ‌న్ గిల్‌

DC vs GT : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టింది. బుధ‌వారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు తేడాతో గెలుపొందింది. ఎట్ట‌కేల‌కు ఈ సీజ‌న్‌లో గెలుపు బోణీ కొట్ట‌డం పై గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

శుభ్‌మ‌న్ గిల్ (70; 45 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), జోస్ బ‌ట్ల‌ర్ (52; 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (55; 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు రాణించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 210 ప‌రుగులు సాధించింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముకేశ్ కుమార్ రెండు, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాద‌వ్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఆ త‌రువాత కేఎల్ రాహుల్ (92; 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తృటిలో సెంచ‌రీ చేజార్చుకోగా.. పాతుమ్ నిస్సాంక (41; 24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స‌ర్), డేవిడ్ మిల్ల‌ర్ (41 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించిన‌ప్ప‌టికి కూడా 211 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 209 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ మూడు, ప్ర‌సిద్ధ్ కృష్ణ రెండు, సిరాజ్ ఓ వికెట్ తీశాడు.

నేను చేసిన త‌ప్పు వ‌ల్ల మ్యాచ్ పోయేది

మ్యాచ్ అనంత‌రం విజ‌యం పై గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్పందించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తాము ఆడిన మూడు మ్యాచ్‌లు కూడా చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లాయ‌ని, అయితే.. ఈ సారి గెల‌వ‌డం ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌న్నాడు. ఐదో బంతికి మిల్లర్ పరుగు తీయనప్పుడు ఎలా అనిపించింది అనే ప్ర‌శ్న ఎదురుకాగా.. మాకు గెలిచే అవకాశం ఉంద‌ని అనిపించింద‌న్నాడు.

అందుక‌నే మేం ఓడిపోవాల్సి వ‌చ్చింది.. లేదంటేనా.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కామెంట్స్‌..

ఇక చివరి బంతికి ప్రసిద్ధ్‌తో జ‌రిగిన చ‌ర్చ గురించి మాట్లాడుతూ.. మేము యార్కర్ వేయాలా లేక స్లో బాల్ వేయాలా అని చర్చిస్తున్నాము. పిచ్ ను బ‌ట్టి స్లో బాల్ వేస్తే బౌండ‌రీ కొట్ట‌డం క‌ష్ట‌మ‌ని భావించామ‌న్నాడు. అందుక‌నే స్లో బాల్ వేయాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌న్నాడు.

త‌మ జ‌ట్టు ఫీల్డింగ్ గురించి మాట్లాడుతూ.. తాను చేసిన త‌ప్పుల‌ను అంగీక‌రించాడు. తాను కొన్ని ఓవ‌ర్ త్రోలు, ఓ బౌండ‌రీ ఇచ్చాన‌ని అన్నాడు. ఇలాంటి ఉత్కంఠ‌భ‌రిత మ్యాచ్‌ల్లో ఒక్క ప‌రుగు కూడా పెద్ద ప్ర‌భావాన్ని చూపుతుంది. తాను ఇచ్చిన ఆ ఐదు లేదా ఆరు ప‌రుగులు ఎంతో కీల‌కం అన్నాడు. ఇక త‌న బ్యాటింగ్ పై సంతృప్తిని వ్య‌క్తం చేశాడు. ఇదే జోష్‌ను త‌దుప‌రి మ్యాచ్‌ల్లో కంటిన్యూ చేస్తామ‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.