Delhi Capitals : పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు షాక్‌.. నెట్స్‌లో గాయ‌ప‌డిన యువ ఆట‌గాడు

ఢిల్లీ క్యాపిట‌ల్స్ నెట్స్‌లో (Delhi Capitals ) ప్రాక్టీస్ చేస్తుండ‌గా 18 ఏళ్ల నెట్ బౌల‌ర్ సాహిల్ ప‌రాఖ్ ముఖానికి బంతి బ‌లంగా త‌గిలింది.

IPL 2026 Delhi Capitals net bowler was struck on the face during a training session

  • నెట్స్‌లో గాయ‌ప‌డిన నెట్ బౌల‌ర్ సాహిల్ ప‌రాఖ్
  • ముఖానికి త‌గిలిన బంతి
  • ర‌క్త‌స్రావం అవుతుండ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Delhi Capitals : ఐపీఎల్ 2026లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నేడు (ఏప్రిల్ 25) త‌ల‌ప‌డ‌నుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు భారీ షాక్ త‌గ‌లింది. ఆ జ‌ట్టు యువ ఆట‌గాడు నెట్స్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

శుక్ర‌వారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండ‌గా 18 ఏళ్ల నెట్ బౌల‌ర్ సాహిల్ ప‌రాఖ్ ముఖానికి బంతి బ‌లంగా త‌గిలింది. వెంట‌నే నొప్పితో అత‌డు కూల‌బ‌డిపోయాడు. ర‌క్త‌స్రావం కావ‌డంతో వెంట‌నే అత‌డిని అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అత‌డిని మైదానంలో స్ట్రెచ‌ర్ పై అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న దృశ్యాల‌కు సంబంధించిన‌ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

PV Sindhu : అరెరె.. పీవీ సింధుకు ఏమైంది ? ఫోటోలు వైర‌ల్‌..

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals ) 6 మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా మ‌రో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేటు -0.130గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక పంజాబ్ కింగ్స్ పై విజ‌యం సాధించి ప‌ట్టిక‌లో త‌మ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకోవాల‌ని ఆకాంక్షిస్తోంది.