IPL 2026 Eliminator: ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌కు బిగ్ షాక్.. క్వాలిఫయర్ 2కు రాజస్తాన్

బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.

  • Updated on- May 28, 2026 / 12:44 AM IST

IPL 2026 Eliminator: తప్పక గెలవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. 244 రన్స్ టార్గెట్ ను చేదించే క్రమంలో హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో 47 పరుగుల తేడాతో రాజస్తాన్ విక్టరీ కొట్టింది.

కీలక మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ లోనే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. దాంతో ఎస్ఆర్ హెచ్ ఒత్తిడిలోకి వెళ్లింది. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ చెలరేగాడు. 3 వికెట్లు తీసి హైదరాబాద్ ను దెబ్బకొట్టాడు. బర్గర్, మిశ్రా, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. యశ్ రాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక, మే 29న గుజరాత్ టైటాన్స్ తో క్వాలిఫయర్ 2 ఆడనుంది రాజస్తాన్ రాయల్స్.

ఈ మ్యాచ్ హీరో 15ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 29 బంతుల్లోనే 97 పరుగులు చేశాడంతో ఏ రేంజ్ లో ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ భారీ స్కోర్ చేయడంలో, ఎస్ఆర్ హెచ్ ను ఒత్తిడిలోకి నెట్టడంలో వైభవ్ సూర్యవంశీ రోల్ చాలా కీలకం.