IPL 2026 Final Kohli : ఇదేం దిక్కు మాలిన నిర్ణయం.. కోహ్లీ, అనుష్క శర్మ మాములుగా రియాక్ట్ అవ్వలేదు కదా..!
IPL 2026 Final Kohli : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, అనుష్కలు స్పందించిన తీరు నెట్టింట వైరల్ గా మారింది.
- Dharani Pilli
- Updated on- June 1, 2026 / 07:36 AM IST
IPL 2026 Final vs GT Virat Kohli Anushka Sharma Stunned as Third Umpires Decision Goes Against RCB
IPL 2026 Final Kohli : ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఒక వివాదాస్పద సంఘటన వెలుగుచూసింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 10వ ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్.. జేకబ్ డఫీ వేసిన డెలివరీని ఫైన్ లెగ్ వైపు ఆడాడు. ఈ క్రమంలో డీప్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆర్సీబీ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జోర్డాన్ కాక్స్ ముందుకు డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది కాస్తా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కారణం బంతిని అందుకునే క్రమంలో జోర్డాన్ కాక్స్ చేతిలోని బంతి నేలకు తాకినట్లు కనిపించింది. సుందర్ పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, ఫీల్డ్ అంపైర్లు ఆ క్యాచ్‌ను థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు.
రజత్ పాటిదార్ అసంతృప్తి
పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్.. కాక్స్ క్యాచ్ పూర్తి చేసే క్రమంలో బంతిని నేలకు తాకించాడని (గ్రౌండ్ అయిందని) తేల్చారు. దీంతో బిగ్ స్క్రీన్‌పై ‘నాట్ అవుట్’ అని తీర్పు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఫీల్డ్ అంపైర్‌తో వాదించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక స్టేడియంలోని భారీ స్క్రీన్ మీద నాట్ అవుట్ అని థర్డ్ అంపైర్ తీర్పు కనిపించగానే విరాట్ కోహ్లీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. “ఇదేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు?” అని అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా రియాక్ట్ అయ్యాడు.
వైరల్‌గా మారిన అనుష్క శర్మ రియాక్షన్
ఇక ఇదే నిర్ణయంపై స్టాండ్స్‌లో ఉన్న విరాట్ భార్య అనుష్క శర్మ కూడా షాక్ అయ్యింది. ఆ తీర్పును నమ్మలేక ఆశ్చర్యపోయింది. ఇదేం దిక్కుమాలిన నిర్ణయం అన్నట్లుగా కోహ్లీ, అనుష్క ఇచ్చిన రియాక్షన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో చెలరేగిన వివాదం
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. లీగ్ మ్యాచ్‌లో జీటీ (GT) ఆటగాడు జేసన్ హోల్డర్ పట్టిన క్యాచ్‌తో జోర్డాన్ కాక్స్ క్యాచ్‌ను పోలుస్తూ సోషల్ మీడియాలో అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే, ఆ మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి అంపైర్ భిన్నమైన తీర్పును ఇవ్వడం గమనార్హం.
