RCB : చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి గుడ్‌న్యూస్‌!

చెన్నైతో మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి (RCB ) గుడ్‌న్యూస్ అందింది.

IPL 2026 Good news to Royal Challengers Bengaluru ahead of RCB vs CSK match (pic credit@rcb)

  • ఆర్‌సీబీకి శుభ‌వార్త‌
  • గాయం నుంచి కోలుకున్న స్టార్ పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్
  • ప్రాక్టీస్ మొద‌లెట్టేశాడు

RCB : ఐపీఎల్ 2026లో తొలి మ్యాచ్ గెలిచి మంచి జోష్‌లో ఉంది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. త‌మ రెండో మ్యాచ్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఆదివారం (ఏప్రిల్ 5న‌) ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ జ‌ట్టుకు శుభ‌వార్త అందింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్ ఊహించిన దాని క‌న్నా వేగంగా కోలుకుంటున్నాడ‌ని స‌మాచారం. ఈ నేపథ్యంలో అత‌డు అతి త్వ‌ర‌లోనే జ‌ట్టుతో క‌లిసి అవ‌కాశం ఉంది.

ఆర్‌సీబీ పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్ ప్ర‌స్తుతం తొడ‌కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. యాషెస్ సిరీస్‌తో పాటు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కి దూరం అయ్యాడు. ఐపీఎల్‌లో కూడా ఆడేది అనుమానం అనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. భార‌త్‌కు వ‌చ్చిన జోష్ హేజిల్‌వుడ్ ఆర్‌సీబీ జ‌ట్టుతో చేరాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతానికి మ్యాచ్‌లు ఆడ‌డం లేదు.

Matthew Hayden : మాథ్యూ హేడెన్ మంచి మ‌న‌సుకు నెటిజ‌న్లు ఫిదా.. మ్యాచ్ త‌రువాత మైదానంలో.. వీడియో వైర‌ల్‌

రెవ్‌స్పోర్ట్జ్ నివేదిక ప్రకారం.. జోష్ హేజిల్‌వుడ్ పునరాగమనానికి చాలా దగ్గరలో ఉన్నాడు. ఈ ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు ప్రాక్టీస్ మొద‌లుపెట్టిన‌ట్లు పేర్కొంది. దాదాపు గంట పాటు అత‌డు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడ‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 10న గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంద‌ని అంది.