SRH : సన్‌రైజర్స్ ఫోన్ నంబర్ ఇదే.. 0, 6, 11, 9, 14, 16, 2, 4, 3
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH ) ఘోర పరాజయాన్ని చవిచూసింది.
IPL 2026 GT vs SRH Is this Sunrisers Hyderabad phone number netizens troll (pic credit@ipl)
- గుజరాత్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన
- 169 పరుగుల లక్ష్య ఛేదనలో 86 పరుగులకే ఆలౌట్
- సోషల్ మీడియాలో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల పై విమర్శలు
SRH : ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 169 పరుగుల లక్ష్య ఛేదనలో 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 82 పరుగుల తేడాతో ఓడిపోవడం పరుగుల పరంగా ఎస్ఆర్హెచ్కు ఇదే అతి పెద్ద ఓటమి.
ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (11), హెన్రిచ్ క్లాసెన్ (14), సలీల్ అరోరా (16), పాట్ కమిన్స్ (19)లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా ఘోరంగా విఫలం అయ్యారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు బోర్డును పోస్ట్ చేస్తూ.. 0, 6, 11, 9, 14, 16, 2, 19, 4, 3 సన్‌రైజర్స్ ఫోన్ నంబర్ ఇది అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
మరోవైపు మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు బ్యాటర్లను వెనుకేసుకొచ్చాడు. ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం కష్టం అని అన్నాడు. గుజరాత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కితాబు ఇచ్చాడు. టీ20 క్రికెట్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ అని అన్నాడు. తమ జట్టులోని టాప్-4 బ్యాటర్లు ఈ సీజన్లో 400కి పైగా పరుగులు సాధించారని గుర్తుచేశాడు. ఒక్క వైఫల్యంతో వారిని నిందించలేమన్నాడు. సాధ్యమైనంత త్వరగా ఈ ఓటమిని మరిచిపోయి ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు.
