Virat Kohli Injury: గాయం నుంచి కోలుకోని విరాట్ కోహ్లీ! లక్నోతో మ్యాచ్ ఆడడం అనుమానమే?
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli)ఆడేది లేనిది అనుమానంగా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 15, 2026 / 05:23 PM IST
IPL 2026 Injury Issue For Kohli Wears Bandage On left Leg
- నేడు ఆర్‌సీబీ, లక్నోల మధ్య మ్యాచ్
- గాయం నుంచి ఇంకా కోలుకోని కోహ్లీ
- మ్యాచ్ ఆడేది అనుమానమే!
Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంకో మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక నేడు (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
అయితే.. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడేది లేనిది అనుమానంగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో కోహ్లీ కాలికి బ్యాండేజ్‌తో కనిపించాడు.
*కోల్‌కతాకు షాక్.. అజింక్యా రహానేకు భారీ షాక్..
మంగళవారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ ఎడమ కాలికి బ్యాండేజ్‌తో కనిపించాడు. ఇక ప్రాక్టీస్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌తో పాటు సహాయక సిబ్బందిలో ఒకడైన కేన్ విలియమ్సన్‌ను కోహ్లీ పలకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Yaari dosti 🥹🤌 pic.twitter.com/lgdcrCTITI
— Lucknow Super Giants (@LucknowIPL) April 14, 2026
కాగా.. విరాట్ కోహ్లీ చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. ఫీల్డింగ్‌కు రాని సంగతి తెలిసిందే. గాయం నుంచి కోహ్లీ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు లక్నోతో మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది. కోహ్లీ విషయంలో ఆర్‌సీబీ ఎలాంటి రిస్క్ తీసుకోదని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ కోహ్లీ ఆడాలని భావిస్తే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
*జట్టులో భారీ మార్పులు తప్పదు.. సీఎస్‌కే పై ఓటమితో అజింక్యా రహానేకు జ్ఞానోదయం..!
ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లు ఆడిన విరాట్ 59.66 సగటు, 162.72 స్ట్రైక్ రేట్‌తో 179 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలతో ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 69 నాటౌట్.
