IPL 2026 : మా ఓటమికి కారణం వాళ్లే.. చాలా క్యాచ్‌లు చేజారాయి.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్..
IPL 2026 : కేకేఆర్ జట్టుపై మా ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్. మా జట్టు ఫీల్డింగ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పిచ్ పై 200 నుంచి 210 పరుగులే చాలా ఎక్కువ. కానీ, కేకేఆర్ జట్టు భారీ స్కోర్ చేసింది. అందుకు కారణం మేము క్యాచ్‌లు వదిలేయడం వల్లనేనని కెప్టెన్ శుభ్ మన్ గిల్ అన్నాడు.
- Harish Thanniru
- Updated on- May 17, 2026 / 09:45 AM IST
IPL 2026 Shubman Gill
IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత కోల్‌కతా బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 218 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 29 పరుగుల తేడాతో గుజరాత్ జట్టుపై కేకేఆర్ జట్టు విజయం సాధించింది. అయితే, మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ.. జట్టు ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.
శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తమ జట్టు ఫీల్డింగ్ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మేము ఫీల్డింగ్‌లో ఒక నిర్దిష్ట ప్రమాణాన్ని కలిగి ఉన్నాం. అలాంటిది మూడు అత్యంత సులువైన క్యాచ్‌లను వదిలేశాక ఈ మ్యాచ్ గెలవడానికి అర్హులం కాదు. ప్లే ఆఫ్స్ ముంగిట ఎదురైన ఈ పరాజయం ఒకరకంగా తమకు మంచిదేనని గిల్ అభిప్రాయపడ్డాడు. రాబోయే రెండు రోజులు కాస్త విశ్రాంతి తీసుకుని అహ్మదాబాద్ కు ప్రయాణం అవుతాం. అక్కడ పిచ్ ఎలా ఉందో చూసి దానికి అనుగుణంగా తదుపరి మ్యాచ్ కోసం మా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని చెప్పాడు.
కేకేఆర్ జట్టుపై మా ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్. మా జట్టు ఫీల్డింగ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పిచ్ పై 200 నుంచి 210 పరుగులే చాలా ఎక్కువ. కానీ, కేకేఆర్ జట్టు భారీ స్కోర్ చేసింది. అందుకు కారణం మేము క్యాచ్ లు వదిలేయడం వల్లనే. పిచ్ బాగున్నప్పటికీ.. అక్కడక్కడా కొన్ని బంతులు ఆగుతూ వచ్చాయి. కానీ, మేము చేసిన స్కోర్ ను బట్టి మా బ్యాటర్లు బాగానే రాణించారు. వచ్చే మ్యాచ్ లలో ఫీల్డింగ్ లో మెరుగైన ప్రదర్శన చేస్తాం.. ఆమేరకు అన్ని ప్రయత్నాలు చేస్తామని గిల్ చెప్పుకొచ్చాడు.
