IPL 2026 : ఓ వైపు రంజుగా ఐపీఎల్ మ్యాచ్.. మరోవైపు స్టాండ్స్ లో కపుల్ క్యూట్ గొడవ.. లాస్ట్‌లో భార్య ట్విస్ట్ అదుర్స్..
ఓ వైపు ఐపీఎల్ మ్యాచ్ (IPL 2026 ) ఆసక్తికరంగా సాగుతుండగా మరో వైపు స్టాండ్స్‌లో ఓ క్యూట్ కపుల్ సరదాగా గొడవపెట్టుకున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : April 11, 2026 / 12:25 PM IST
IPL 2026 KKR vs LSG husband and wife had a cute little argument while watching match
- గురువారం కేకేఆర్ వర్సెస్ లక్నో మ్యాచ్ జరుగుతుండగా
- స్టాండ్స్‌లో కపుల్ క్యూట్ గొడవ
- వైరల్‌గా మారిన వీడియో
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అదే సమయంలో మైదానంలో ప్రేక్షకులు చేసే కొన్ని పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ క్యూట్ కపుల్ మైదానంలో చేసిన పని వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 9న (గురువారం) కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యం ఇచ్చింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఓ క్యూట్ కపుల్ కూడా ఉన్నారు. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగా ఈ క్యూట్ కపుల్ మధ్యలో ఏదో విషయంలో చిన్నపాటి వాదన జరిగింది.
సరదాగానే ఇద్దరు ఒకరు నొకరు గిల్లుకున్నారు. భార్యకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే సదరు భర్త మాత్రం ఆమెను పట్టించుకోకుండా మ్యాచ్‌ను చూస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చిన భార్య అతడి గల్లా పట్టుకుని వెనక్కి నెట్టేసింది. ఆమె మ్యాచ్‌ను చూసింది. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అంగ్క్రిష్ రఘువంశీ (45; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్యా రహానే (41; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ లు తలా ఓ వికెట్ తీశారు.
During the KKR vs LSG match yesterday, a husband and wife had a cute little argument while watching match from the stands. The wife got angry and walked away, but the husband didn’t leave the match to go after her. After some time, she came back on her own.😂❤️ pic.twitter.com/WHOzRpjD1J
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 10, 2026
182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలవగా.. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ముకుల్ చౌదరి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 54 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో లక్నోకు విజయాన్ని అందించాడు. ముకుల్ ధాటికి లక్నో సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు లక్ష్యాన్ని అందుకుంది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
