KKR vs PBKS : కోల్‌క‌తాకు వ‌రుణుడి సాయం.. పాయింట్ల ఖాతా ఓపెన్‌..

సోమ‌వారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ (KKR vs PBKS) వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది.

IPL 2026 KKR vs PBKS Match Abandoned Due to Rain

  • వ‌ర్షం కార‌ణంగా కోల్‌క‌తా వ‌ర్సెస్ పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు
  • ఇరు జ‌ట్ల‌కు చెరొక పాయింట్‌

KKR vs PBKS : ఐపీఎల్ 2026లో తొలిసారి వ‌రుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సోమ‌వారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ ర‌ద్దైంది. కేవ‌లం 3.4 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా జ‌ట్టుకు పంజాబ్ బౌల‌ర్ బార్ట్‌లెట్ ఒకే ఓవ‌ర్‌లో రెండు షాక్‌లు ఇచ్చాడు. ఓపెన‌ర్ ఫిన్ అలెన్ (6), వ‌న్‌డౌన్ బ్యాట‌ర్‌  కామోరూన్ గ్రీన్ (4) ల‌ను ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌లోనే పెవిలియ‌న్‌కు చేర్చాడు. ఈ క్ర‌మంలో మ‌రో ఓపెన‌ర్ ర‌హానె (8నాటౌట్‌)కు ర‌ఘువంశీ (7 నాటౌట్‌) జ‌త క‌లిశాడు. అయితే.. 3.4 ఓవ‌ర్ వ‌ద్ద వ‌ర్షం ప్రారంభమైంది. అప్ప‌టికి కేకేఆర్ స్కోరు 25/2.

Tim David : ఒక్క ప‌రుగు తేడాతో ప్ర‌పంచ రికార్డును కోల్పోయిన టిమ్ డేవిడ్‌..

చాలా సేపు వ‌ర్షం ప‌డింది. క‌టాప్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డిన స‌మ‌యంలో వ‌ర్షం ఆగింది. దీంతో 5 ఓవ‌ర్ల మ్యాచ్‌ను నిర్వ‌హిస్తార‌ని ఫ్యాన్స్ భావించారు. అయితే.. ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా మార‌డంతో మ్యాచ్‌ను నిర్వ‌హించే వీలులేక‌పోయింది. దీంతో చేసేది లేక మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. ఇరు జ‌ట్ల‌కు చెరొక పాయింట్‌ను కేటాయించారు.

పాయింట్ల ఖాతా తెరిచిన కేకేఆర్‌..

తాజా మ్యాచ్‌తో క‌లిసి పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా వ‌ర్షం కార‌ణంగా ఓ మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో ఆ జ‌ట్టు ఖాతాలో 5 పాయింట్లు వ‌చ్చి చేరాయి.

RCB vs CSK : చెన్నైపై ఆర్‌సీబీ గెల‌వ‌గానే చిన్న‌స్వామి స్టేడియంలో యువ‌తి ర‌చ్చ ర‌చ్చ‌.. బెదిరిపోయిన‌ సీఎస్‌కే ఫ్యాన్‌.. వీడియో వైర‌ల్‌..

ఇక కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్ విష‌యానికి వ‌స్తే.. తాజా మ్యాచ్‌తో క‌లిపి కేకేఆర్ కూడా మూడు మ్యాచ్‌ల‌ను పూర్తి చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్ ఓడిపోయింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో కూడా రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో కేకేఆర్ పాయింట్ల ఖాతా తెరిచింది. ఆ జ‌ట్టు ఖాతాలో ఓ పాయింట్ వ‌చ్చి చేరింది.