Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సన్‌రైజర్స్ తరుపున సెంచరీ చేసిన తొలి బ్యాటర్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 3, 2026 / 11:38 AM IST
IPL 2026 KKR vs SRH Abhishek Sharma creates history to becomes first india batter 100 sixes for SRH (pic credit@ipl)
- ఎస్ఆర్‌హెచ్ తరుపున వంద సిక్సర్లు కొట్టిన అభిషేక్ శర్మ
- ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రికెటర్
- ఓవరాల్‌గా రెండవ ఆటగాడు
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున వంద సిక్సర్లు బాదిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఇక ఓవరాల్‌గా ఎస్ఆర్‌హెచ్ తరుపున వంద సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ మాత్రమే అభిషేక్ కన్నా ముందు ఈ ఘనత సాధించాడు.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుపున అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..
* డేవిడ్ వార్నర్ – 143 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 101 సిక్సర్లు
* హెన్రిచ్ క్లాసెన్ – 89 సిక్సర్లు
* కేన్ విలియమ్సన్ – 64 సిక్సర్లు
* ట్రావిస్ హెడ్ – 50 సిక్సర్లు
ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెన్ (52) హాఫ్ సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ (48), ట్రావిస్ హెడ్ (46) లు రాణించారు. కేకేఆర్ బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని నాలుగు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా రెండు వికెట్లు పడగొట్టాడు,. కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ లు చెరో వికెట్ సాధించారు.
ఆ తరువాత 227 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. కేకేఆర్ బ్యాటర్లలో అంక్రిష్ రఘువంశీ (52) హాఫ్ సెంచరీ చేశాడు. ఎస్ఆర్‌హెఛ్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ మూడు వికెట్లు తీశాడు. మలింగ, నితీశ్‌కుమార్ రెడ్డి లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ష్ దూబె ఓ వికెట్ సాధించాడు.
