Mohammed Shami : చ‌రిత్ర సృష్టించిన ష‌మీ.. 19 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఏకైక బౌల‌ర్

ఐపీఎల్‌లో టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ (Mohammed Shami ) అరుదైన సాధించాడు.

IPL 2026 LSG vs DC Shami Scripts Massive Record With Rahul Wicket (pic credit@ipl)

  • ఐపీఎల్‌లో ష‌మీ అరుదైన ఘ‌న‌త‌
  • తొలి బంతికే ఐదు సార్లు వికెట్‌
  • ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక బౌల‌ర్‌

Mohammed Shami : ఐపీఎల్‌లో టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ అరుదైన సాధించాడు. తొలి బంతికే 5 సార్లు వికెట్ తీసిన ఏకైక బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. బుధ‌వారం ఎకానా స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో ల‌క్నో త‌రుపున ఆడుతూ తొలి బంతికే కేఎల్ రాహుల్ వికెట్ తీసి ష‌మీ ఈ ఘ‌న‌త సాధించాడు.

ఐపీఎల్‌లో తొలి బంతికే అత్య‌ధిక సార్లు వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

* మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ – 5 సార్లు
* ప్రవీణ్ కుమార్ – 3 సార్లు
* ఉమేష్ యాద‌వ్ – 3 సార్లు
* ట్రెంట్ బౌల్డ్ – 3 సార్లు
* ల‌సిత్ మ‌లింగ – 3 సార్లు
* భువ‌నేశ్వ‌ర్ కుమార్ – 3 సార్లు
* అశోక్ దిండా – 3 సార్లు
* పాట్ క‌మిన్స్ – 3 సార్లు
Sanjiv Goenka : న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లా? కెప్టెన్‌కు నా పూర్తి మ‌ద్ద‌తు.. సోష‌ల్ మీడియాలో సంజీవ్ గొయెంకా పోస్ట్

ష‌మీ 2013లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 121 మ్యాచ్‌లు ఆడాడు 8.62 ఎకాన‌మీతో 134 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న ఉంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 18.4 ఓవ‌ర్ల‌లో 141 ప‌రుగుల‌కు ఆలౌటైంది. లక్నో బ్యాట‌ర్ల‌లో అబ్దుల్ స‌మ‌ద్ (36) మిచెల్ మార్ష్ (35) లు రాణించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో లుంగి ఎంగిడి, న‌ట‌రాజ‌న్‌లు చెరో మూడు, కుల్దీప్ యాద‌వ్ రెండు. అక్ష‌ర్ ప‌టేల్ ఓ వికెట్ సాధించారు.

Sanjiv Goenka : ఈయ‌న మార‌డు.. మ్యాచ్ ఓడిపోగానే ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా ఏం చేశాడో చూశారా?

ఆ త‌రువాత సమీర్ రిజ్వీ (70 నాటౌట్) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా ట్రిస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) రాణించ‌డంతో 142 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 17.1 ఓవ‌ర్ల‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఛేదించింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్సీ యాద‌వ్ రెండు, మ‌హ్మ‌ద్ ష‌మీ, మోసిన్ ఖాన్ లు చెరో వికెట్ తీశారు.