RCB vs LSG Today: లక్నో సూపర్ జెయింట్స్ మాస్టర్ ఫ్లాన్.. కోహ్లీని దెబ్బకొట్టేందుకేనా?
LSG Mayank Yadav: బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs LSG)తలపడనుంది.
- Thota Vamshi Kumar
- Updated on- April 15, 2026 / 05:26 PM IST
IPL 2026 Mayank Yadav is fit he plays RCB vs LSG match says Tom Mood (pic credit@ipl)
- గాయం నుంచి కోలుకున్న మయాంక్ యాదవ్
- మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడని చెప్పిన టామ్ మూడీ
- ఆర్‌సీబీతో మ్యాచ్ ఆడతాడని వెల్లడి
RCB vs LSG Match: ఐపీఎల్ 2026లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బాల్ వేసిన రికార్డు ఉన్న మయాంక్ యాదవ్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ డైరెక్టర్ టామ్ మూడీ వెల్లడించాడు. అతడు గాయం నుంచి కోలుకున్నాడని, పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని తెలిపాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో గాయం కారణంగా మయాంక్ యాదవ్ కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. దాదాపు ఏడాదికి పైగా అతడు ఆటకు దూరం అయ్యాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటి వరకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక్క మ్యాచ్‌లో కూడా మయాంక్ ఆడలేదు. దీనిపై మూడీ మాట్లాడుతూ.. వర్క్‌లోడ్ నేపథ్యంలోనే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడించలేదన్నాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.
*జట్టులో భారీ మార్పులు తప్పదు.. సీఎస్‌కే పై ఓటమితో అజింక్యా రహానేకు జ్ఞానోదయం..!
మరో పేసర్ మోహ్సిన్ ఖాన్ సైతం గాయం నుంచి కోలుకున్నాడు. బుధవారం జరిగే ఫిట్‌నెస్ పరీక్షల్లో అతడు పాసైతే అతడు కూడా అందుబాటులోకి వస్తాడు. ఈ ఇద్దరు పేసర్లు జట్టులోకి వస్తే లక్నో బౌలింగ్ మరింత బలోపేతం అవుతోంది. వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతానికి ఆ జట్టు బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు.
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉండగా ఆర్‌సీబీ మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తమ తమ స్థానాలను మెరుగుపరచుకోవాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి.
