Hardik Pandya : హార్దిక్ పాండ్యా ఫామ్ పై ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే కీల‌క వ్యాఖ్య‌లు..

ముంబై కెప్టెన్ హార్దిక్ (Hardik Pandya) ఫామ్ పై జ‌య‌వ‌ర్ధ‌నే స్పందించాడు.

IPL 2026 MI vs CSK Mahela Jayawardene comments on Hardik Pandya poor Form

  • వాంఖ‌డేలో సీఎస్‌కే పై ఓట‌మి
  • ఈ సీజ‌న్‌లో ముంబై పేల‌వ ఫామ్ పై స్పందించిన జ‌య‌వ‌ర్ధ‌నే
  • హార్దిక్ పాండ్యాకు మ‌ద్ద‌తు

Hardik Pandya : వాంఖ‌డే వేదిక‌గా గురువారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 103 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. వాంఖ‌డేలో ముంబైకి ఇదే అతి పెద్ద ఓట‌మి కాగా.. ఈ సీజ‌న్‌లో ముంబైకి ఇది 5వ ప‌రాజ‌యం. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ అనంత‌రం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఈ సీజ‌న్‌లో త‌మ జ‌ట్టు పేలవ ప్ర‌దర్శ‌న‌పై ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ మ‌హేల జ‌య‌వ‌ర్ధ‌నే స్పందించాడు. ఈ సీజ‌న్ తొలి అర్థ‌భాగంలో తమ జట్టు ప్రదర్శన ఏమాత్రం బాగోలేదన్నాడు.

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేటు -0.736గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానంలో ఉంది. దీనిపై జ‌య‌వ‌ర్ధ‌నే మాట్లాడుతూ.. ‘ఈ సీజ‌న్‌లో జ‌ట్టు సగం మ్యాచ్‌లు ముగిశాయి. కేవ‌లం నాలుగు పాయింట్లు మాత్ర‌మే సాధించాం. నిజం చెప్పాలంటే మేము మంచి క్రికెట్ ఆడ‌లేదు. ఒక‌టి అరా విజ‌యాల‌ను సాధించాము. ముఖ్యంగా అహ్మ‌దాబాద్‌లో అద్భుతంగా ఆడాము. దీంతో మేము ల‌య‌ను అందుకున్నామ‌ని అనుకున్నాము. అయితే.. మ‌ళ్లీ ఈ రోజు నిరాశే ఎదురైంది.’ అని జ‌య‌వ‌ర్ధ‌నే అన్నాడు.

Sanju Samson : వాంఖ‌డేలో సెంచ‌రీ.. ఎంతో గొప్ప‌గా అనిపిస్తుంది.. నిజంగా ఇది .. సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

ఈ మ్యాచ్‌లో ప‌వ‌ర్ ప్లేలో మా ఆట చాలా ఘోరంగా ఉంది. ఇటు బౌలింగ్‌లో, అటు బ్యాటింగ్‌లో రెండింటిలో కూడా ప‌వ‌ర్ ప్లేలో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేశాము. దీంతో మ్యాచ్‌లో నిల‌బ‌డ‌లేక‌పోయాము. ఇప్పుడు త‌దుప‌రి మ్యాచ్‌కు ముందు మాకు కాస్త విరామం దొరికింది. ఈ విరామంలో త‌దుప‌రి ఏడు మ్యాచ్‌ల్లో ఎలా విజ‌యం సాధించాల‌నే దానిపైనే దృష్టి సారిస్తాం. త‌ప్పులు ఎక్క‌డ జ‌రిగాయో గుర్తించి స‌రిదిద్దుకుంటాం. అని జ‌య‌వ‌ర్ధ‌నే తెలిపాడు.

త‌మ జ‌ట్టు బౌలింగ్ విభాగం పై ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. తాము కొంతమంది కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చామన్నాడు. అహ్మ‌దాబాద్‌లో బౌల‌ర్లు చాలా బాగా వేశారు. అయితే.. వారిలో నిల‌క‌డ లోపించింది. అత్య‌ధిక సార్లు ఓవ‌ర్‌కు 18 పైగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న జ‌ట్ల‌లో తాము కూడా ఉన్నాము. ఒక ఓవ‌ర్‌కు 20కి పైగా ప‌రుగులు ఇచ్చిన‌ప్పుడు మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని అని తెలిపాడు. ఈ విభాగంలో తాము ఖ‌చ్చితంగా మెరుగుప‌డాల్సి ఉంద‌న్నాడు.

హార్దిక్ ఫామ్ పై..

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్‌లో బ్యాట్, బాల్ రెండింటితోనూ నిల‌క‌డ‌గా రాణించ‌డంలో విఫ‌లం అయ్యాడు. వికెట్లు తీయ‌డం లేదంటే బ్యాటింగ్‌లో భారీగా ప‌రుగులు సాధించ‌లేక‌పోయాడు. ఈ క్ర‌మంలో జ‌య‌వ‌ర్ధ‌నే ముంబై కెప్టెన్ హార్దిక్ ఫామ్ పై స్పందించాడు. అత‌డికి మ‌ద్ద‌తుగా నిలిచాడు.

కెప్టెన్సీ ప్ర‌భావం వ‌ల్లే హార్దిక్ విఫ‌లం అవుతున్నాడా? అనే ప్ర‌శ్న‌కు జ‌య‌వ‌ర్ధ‌నే ఇలా స‌మాధానం ఇచ్చాడు. వాస్త‌వం చెప్పాలంటే ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌యం అని తాను అనుకోవ‌డం లేద‌న్నాడు. అత‌డు ఈ సీజ‌న్ ను బాగానే ప్రారంభించాడ‌ని చెప్పుకొచ్చాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అత‌డు చాలా చ‌క్క‌గా బౌలింగ్ చేశాడ‌ని తెలిపాడు. తాను ఇంత‌క‌ముందు చెప్పిన‌ట్లుగా.. తాము ఏ ఒక్క‌రినో నిందించ‌న‌ని అన్నాడు. జ‌ట్టుగా విఫ‌లం అయ్యామ‌ని తెలిపాడు. తాము మెరుగుప‌డాల్సి ఉంద‌న్నాడు.

MI vs CSK : ఓట‌మికి సాకులు చెప్ప‌డం లేదు.. నిజంగా మా కొంప‌ముంచింది అదే.. హార్దిక్ పాండ్యా కామెంట్స్‌..

ముంబై త‌మ త‌దుప‌రి మ్యాచ్‌ను వాంఖ‌డే వేదిక‌గా ఏప్రిల్ 29న ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు ముంబైకి ఐదు రోజుల విరామం ల‌భించింది.