Raghu Sharma : 33 ఏళ్ల వ‌య‌సులో ఐపీఎల్‌లో తొలి వికెట్‌.. జై శ్రీరామ్ నోట్‌తో సంబ‌రాలు.. వీడియో వైర‌ల్

ముంబై లెగ్ స్పిన్న‌ర్ ర‌ఘు శ‌ర్మ (Raghu Sharma) ఐపీఎల్‌లో తొలి వికెట్‌ను సాధించిన త‌రువాత ఓ నోట్‌ను జేబులోంచి తీసి ప్రేక్ష‌కుల‌కు చూపిస్తూ సంబ‌రాలు చేసుకున్నాడు.

IPL 2026 MI vs LSG Raghu Sharma celebrated with a mysterious note after taking his first ever IPL wicket

  • ఐపీఎల్‌లో తొలి వికెట్ తీసిన త‌రువాత ముంబై లెగ్ స్పిన్న‌ర్ ర‌ఘు శ‌ర్మ భావోద్వేగం
  • జేబులోంచి ఓ నోట్‌ను తీసి ప్రేక్ష‌కుల‌కు చూపిస్తూ సంబ‌రాలు చేసుకున్న 33 ఏళ్ల ఆట‌గాడు

Raghu Sharma : ఐపీఎల్ 2026లో భాగంగా సోమ‌వారం ముంబై ఇండియ‌న్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఓ భావోద్వేగ‌పూరిత‌మైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ముంబై ఇండియ‌న్స్‌కు చెందిన 33 ఏళ్ల లెగ్ స్పిన్న‌ర్ ర‌ఘు శ‌ర్మ ఐపీఎల్‌లో తొలి వికెట్‌ను సాధించాడు. ఈ క్ర‌మంలో అత‌డు భావోద్వేగానికి లోనుకావ‌డంతో పాటు త‌న జేబులో నుంచి ఓ నోట్ ను తీసి చూపిస్తూ సంబురాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ల‌క్నో ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను ర‌ఘు శ‌ర్మ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని తొలి బంతికి ల‌క్నో బ్యాట‌ర్ అక్ష‌త్ ర‌ఘువంశీ (11) షాట్ ఆడాడు. అయితే.. బంతి అత‌డి బ్యాట్‌ను తాకుతూ ప్యాడ్ ను తాకి గాల్లోకి లేచింది. బౌల‌ర్ అయిన ర‌ఘుశ‌ర్మ రిట‌ర్న్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత‌డికి ఇది తొలి వికెట్. ఈ క్ర‌మంలో 15 ఏళ్ల అత‌డి నిరీక్ష‌ణ ముగియ‌డంతో అత‌డి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

Hardik Pandya : ల‌క్నోతో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదే.. గుట్టు బ‌య‌ట‌పెట్టిన ర్యాన్ రికెల్ట‌న్‌..

ముందే రాసి జేబులో పెట్టుకున్న నోట్‌ను అత‌డు ప్రేక్ష‌కులకు చూపిస్తూ భావోద్వేగానికి లోనైయ్యాడు. గురువుల కృప‌తో 15 ఏళ్ల సుదీర్ఘ‌మైన, బాధాక‌ర‌ణ‌మైన నిరీక్ష‌ణ ఈ రోజుతో ముగిసింది. నాకు అవ‌కాశం ఇచ్చిన ముంబైకి ఎప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. జై శ్రీరామ్ అని అందులో రాసి ఉంది.

Sunil Gavaskar : ఎట్టి ప‌రిస్థితుల్లో క్ష‌మించ‌ను.. బుమ్రాపై సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం.. అంత పెద్ద త‌ప్పు చేస్తావా?

చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు ర‌ఘు శ‌ర్మ‌. అయితే.. ఆ మ్యాచ్‌లో వికెట్లు తీయ‌కున్నా నాలుగు ఓవ‌ర్ల‌లో 24 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. ఇక తాజాగా ల‌క్నోతో మ్యాచ్‌లో 4 ఓవ‌ర్లు వేసి 36 ప‌రుగులు ఇచ్చి ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. మిగిలిన ముంబై బౌల‌ర్లు భారీగా పరుగులు స‌మ‌ర్పించుకుని 10 కంటే ఎక్కువ ఎకాన‌మీ న‌మోదు చేసిన‌ప్ప‌టికి కూడా ర‌ఘుశ‌ర్మ ఒక్క‌డే 9 ఎకాన‌మీ న‌మోదు చేశాడు.