Hardik Pandya : లక్నోతో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడకపోవడానికి అసలు కారణం ఇదే.. గుట్టు బయటపెట్టిన ర్యాన్ రికెల్టన్..
సోమవారం వాంఖడే వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడలేదు.
- Thota Vamshi Kumar
- Updated on- May 5, 2026 / 10:47 AM IST
IPL 2026 MI vs LSG Ryan Rickelton Explane what happen to Hardik Pandya
- లక్నోతో మ్యాచ్ ఆడని హార్దిక్ పాండ్యా
- అనారోగ్యం అని చెప్పిన తాత్కాలిక కెప్టెన్ సూర్య
- అసలు నిజాన్ని చెప్పిన రికెల్టన్
Hardik Pandya : ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం అయ్యాడు. టాస్ కోసం సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి రావడంతో తొలుత అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక హార్దిక్ ఈ మ్యాచ్‌లో ఆడడు అనే విషయం సోమవారం మధ్యాహ్నం వరకు కూడా తనకు తెలియదు అని ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ చెప్పుకొచ్చాడు.
ఇక టాస్ సందర్భంగా హార్దిక్ ఎందుకు ఆడడం లేదు అనే విషయాన్ని తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అతడి ఆరోగ్యం బాగా లేదని మాత్రమే చెప్పాడు. అయితే.. హార్దిక్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు మ్యాచ్ అనంతరం ర్యాన్ రికెల్టన్ తెలిపాడు. అతడు ఎప్పుడు కోలుకుంటాడు అనే విషయమై తనకు సమాచారం లేదన్నాడు.
‘హార్దిక్‌కు నడుం పట్టేసిందని ఈ మధ్యాహ్నమే నాకు తెలిసింది. గాయం తీవ్రత ఎంత ఉందో నాకు తెలియదు. అతడు ఇప్పుడు ఎలా ఉన్నాకు నాకు ఖచ్చితంగా తెలియదు. అతడు ఎప్పుడు తిరిగి వస్తాడో కూడా నాకు తెలియదు. కానీ ఈ వారంలో మేము రాయ్‌పూర్‌కు వెళ్లేటప్పటికి అతడు మళ్లీ మాతో ఉంటాడనే నమ్మకం నాకు ఉంది.’ అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (63; 21 బంతుల్లో 1 ఫోర్, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, మిచెల్ మార్ష్ (44; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. . ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు, ఘజన్‌ఫర్, విల్ జాక్స్, రఘు శర్మలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్ (83; 32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు), రోహిత్ శర్మ(84; 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్థశతకాలు బాదారు.
