Shreyas Iyer : గుజరాత్ పై విజయం.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ జరిమానా.. మరోసారి ఇలాగే జరిగితే..
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Published On : April 1, 2026 / 11:47 AM IST
IPL 2026 PBKS vs GT Big Shock to Shreyas Iyer Rs 12 lakhs fined (PIC CREDIT@IPL)
- గుజరాత్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదు చేసిన పంజాబ్
- కెప్టెన్ శ్రేయస్‌కు జరిమానా
Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ విజయంతో బోణీ కొట్టింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్ జట్టుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. కెప్టెన్ శ్రేయస్‌కు భారీ జరిమానా విధించింది. స్లో ఓవర్ రేటు (నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడం) నమోదు చేయడమే అందుకు కారణం.
‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. కనీస ఓవర్ రేట్ నిబంధనను శ్రేయస్ అయ్యర్ ఉల్లంఘించాడు. ఈ సీజన్‌లో ఇలాంటి తప్పు చేయడం అతడికి ఇదే తొలిసారి. కాబట్టి రూ.12లక్షల జరిమానా విధిస్తున్నాం.’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది.
పంజాబ్ ఈ సీజన్‌లో మరోసారి ఇదే తప్పిదానికి పాల్పడితే.. అప్పుడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జరిమానా డబుల్ కావడంతో పాటు జట్టులోకి ఆటగాళ్లు అందరికి కూడా పెనాల్టీ పడుతుంది. మూడోసారి కూడా ఇదే తప్పు పునరావృతం అయితే.. అప్పుడు కెప్టెన్ కు 30లక్షల జరిమానా విధించబడుతుంది. అంతేకాదండోయ్ ఓ మ్యాచ్ నిషేదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (39; 27 బంతుల్లో 6 ఫోర్లు), జోస్ బట్లర్ (38; 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిఫ్స్ (25; 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) లు రాణించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయకుమార్ వైశాఖ్ మూడు వికెట్లు సాధించాడు. చాహల్ రెండు, మార్కో జాన్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
PBKS vs GT : అర్ష్‌దీప్ సింగ్ వచ్చి ఒక్కటే చెప్పాడు.. విజయం పై శ్రేయస్ అయ్యర్ హాట్ కామెంట్స్..
ఆ తరువాత కూపర్ కానల్లీ (72 నాటౌట్; 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ హాఫ్ సెంచరీ బాదడంతో పంజాబ్ కింగ్స్ 163 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టాపోయి అందుకుంది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు, కగిసో రబాడ, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
