SRH vs DC : స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు?

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా నేడు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య (SRH vs DC ) మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

IPL 2026 Rain threat to SRH vs DC match in UPPAL

SRH vs DC : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా నేడు (ఏప్రిల్ 21న‌) స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ మైదానం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది.

సాయంత్రం 4 గంట‌ల త‌రువాత ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది. ఈ క్ర‌మంలో ఎల్లో అల్ట‌ర్‌ను జారీ చేసింది. అయితే.. మ్యాచ్ స‌మ‌యం రాత్రి 7.30 గంట‌ల స‌మ‌యంలో ఆకాశం నిర్మ‌లంగా ఉంటుంద‌ని తెలిపింది. మ్యాచ్ స‌మ‌యంలో వ‌ర్షం కురిసే అవ‌కాశం కేవ‌లం రెండు శాతంగానే ఉన్న‌ట్లు చెప్పింది.

Ayush Mhatre : చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్.. గాయంతో మిగిలిన సీజ‌న్ నుంచి ఆయుష్ మాత్రే ఔట్‌..

ఉప్ప‌ల్ మైదానంలో అత్యుత్త‌మ డ్రైనేజీ వ్య‌వ‌స్థ ఉంది. వ‌ర్షం కురిసిన త‌రువాత గంటలోపు స‌మ‌యంలో మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేయ‌వ‌చ్చు. వ‌ర్షం కార‌ణంగా పిచ్ పై తేమ ఉండే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో పిచ్ బౌల‌ర్ల‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో టాస్ గెలిచిన జ‌ట్లు ఫీల్డింగ్ ఎంచుకునే అవ‌కాశం ఉంది.

హెడ్‌-టు-హెడ్‌..
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 26 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 13 మ్యాచ్‌ల్లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ విజ‌యం సాధించ‌గా, మ‌రో 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు.