Rajat Patidar : కోహ్లీ, భువీ కానే కాదు.. నేను ఒత్తిడిలో ఉంటే ఆ ఒక్క‌డి వైపే చూస్తా.. అతడంటే నాకు అంత న‌మ్మ‌కం : ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ హాట్ కామెంట్స్‌..

సీఎస్‌కే పై విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ఆర్‌సీబీ కెప్టెన్ రజ‌త్ పాటిదార్ (Rajat Patidar ) ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

IPL 2026 RCB vs CSK Rajat Patidar comments after Royal Challengers Bengaluru win the match against Chennai Super Kings

  • అద‌ర‌గొడుతున్న ఆర్‌సీబీ
  • వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ విజ‌యం
  • కెప్టెన్ ర‌జత్ పాటిదార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Rajat Patidar : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించింది. ఆదివారం చిన్న‌స్వామి వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 43 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంతో ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఆర్‌సీబీ అగ్ర‌స్థానంలోకి దూసుకువెళ్లింది. కాగా.. సీఎస్‌కే పై విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ఆర్‌సీబీ కెప్టెన్ రజ‌త్ పాటిదార్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

తొలుత‌ బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో టిమ్ డేవిడ్ (25 బంతుల్లో 70 నాటౌట్), దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (29 బంతుల్లో 50 ప‌రుగులు), ర‌జ‌త్ పాటిదార్ (19 బంతుల్లో 48 నాటౌట్), ఫిల్ సాల్ట్ (30 బంతుల్లో 46 ప‌రుగులు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, శివమ్ దూబే లు త‌లా ఓ వికెట్ తీశారు.

అనంత‌రం 251 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 207 ప‌రుగుల‌కు ఆలౌటైంది. చెన్నై బ్యాట‌ర్ల‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (25 బంతుల్లో 50 ప‌రుగులు) అర్ధ‌శ‌త‌కం బాదాడు. ప్ర‌శాంత్ వీర్ (29 బంతుల్లో 43 ప‌రుగులు), జేమీ ఓవర్టన్ (16 బంతుల్లో 37 ప‌రుగులు) లు రాణించారు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ మూడు, జాకబ్ డఫీ, అభినందన్ సింగ్, కృనాల్ పాండ్యా లు త‌లా రెండు వికెట్లు తీశారు. సుయాష్ శర్మ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అత‌డు అంటే నాకు అంత న‌మ్మ‌కం

మ్యాచ్ అనంత‌రం విజ‌యం పై ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ స్పందించాడు. ఈ విజ‌యం చాలా గొప్ప‌గా అనిపిస్తోంద‌న్నాడు. మంచి క్రికెట్ ఆడి, ఇలాంటి విజ‌యాలు సాధిస్తే జ‌ట్టులో ఎంతో సంతృప్తి క‌నిపిస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో బంతి కాస్త ఆగుతూ వ‌చ్చింద‌ని, ఆ స‌మ‌యంలో ఓపెన‌ర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్‌లు ఆడిన విధానం చాలా అద్భుతంగా ఉంద‌న్నాడు. ఆ త‌రువాత టిమ్ డేవిడ్ ఆడిన తీరు నెక్ట్స్ లెవల్‌ అని చెప్పుకొచ్చాడు.

Ruturaj Gaikwad : త‌ప్పు నాదే.. మా వాళ్లు ఇలా బ్యాటింగ్ చేస్తార‌ని అనుకోలేదు.. ముందే తెలిసి ఉంటే..

అత‌డు కొట్టిన సిక్స‌ర్ల‌ను నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌తో పాటు డగౌట్ నుంచి చూస్తూ ఆస్వాదించిన‌ట్లు తెలిపాడు. అత‌డు అత్యుత్త‌మ ఫినిష‌ర్ల‌లో ఒక‌డని అన్నాడు. గ‌త సంవ‌త్స‌రం కూడా అత‌డు ఇలాగే ఆడాడ‌ని, ఇప్పుడు ఇలాగే ఆడుతుండ‌డం త‌మ‌కు ఎంతో సంతోషాన్ని ఇస్తుంద‌ని అన్నాడు. డేవిడ్ కొట్టిన 106 మీట‌ర్ల సిక్స్ గురించి మాట్లాడుతూ.. ఆ బంతిని తాను చూస్తూనే ఉండి పోయిన‌ట్లుగా తెలిపాడు. ఇక తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. తాను క్రీజులో ఉన్నంత వ‌ర‌కు బౌల‌ర్ల పై ఒత్తిడి తీసుకురావ‌డ‌మే త‌న ల‌క్ష్యం అని చెప్పుకొచ్చాడు.

త‌మ బౌలింగ్ విభాగం చాలా బాగుంద‌న్నాడు. డ‌ఫీ త‌న అవుట్ స్వింగ‌ర్ల‌తో మూడు వికెట్లు తీసి మ్యాచ్ మా వైపు మొగ్గుచూపేలా చేశాడ‌ని తెలిపాడు. ఆ త‌రువాత కృనాల్ పాండ్యా వేగంగా ఆడుతున్న‌, కీల‌క‌మైన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ వికెట్ తీసి బ్రేక్ త్రూ అందించాడ‌ని అన్నాడు. డెత్ బౌల‌ర్ల‌లో భువీ వేసిన యార్క‌ర్ అమోఘం అని అన్నాడు. ఇక తాను ఎప్పుడు ఒత్తిడిలో ఉన్నా స‌రే కృనాల్ వైపే చూస్తాన‌ని చెప్పుకొచ్చాడు. అత‌డిపై త‌న‌కు అత్యంత న‌మ్మ‌కం అని చెప్పుకొచ్చాడు. త‌దుప‌రి మ్యాచ్ కోసం తామంత ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లుగా తెలిపాడు.