Virat kohli : కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. 100 శాతం ఫిట్‌గా లేను.. అనారోగ్యంతో బాధపడుతున్నా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ (Virat kohli)
IPL 2026 RCB vs LSG Virat kohli Comments After received orange cap (pic credit@ipl)
- లక్నోతో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ
- తాను 100 శాతం ఫిట్‌గా లేనని వెల్లడి
Virat kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ. బుధవారం చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 49 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో రాణించడం పట్ల కోహ్లీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తాను 100 శాతం ఫిట్‌గా లేనని అన్నాడు.
ఇక ఈ మ్యాచ్ కోహ్లీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. ఆరెంజ్ క్యాప్ అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. తన మోకాలికి గాయమైందన్నాడు. గత కొన్ని రోజులుగా తాను అనారోగ్యంతో ఉన్నట్లుగా వెల్లడించాడు. ‘గత మ్యాచ్ కంటే బాగుంది. నేను ఇంకా 100 శాతం ఫిట్‌గా లేను. గత మ్యాచ్‌లో మోకాలి నొప్పితో ఇబ్బంది పడడ్డాను. అంతేకాదు.. గత నాలుగైదు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను. కాబట్టి ఇప్పుడిప్పుడే నా అత్యుత్తమ ఫామ్‌ను తిరిగి పొందుతున్నాను. ఈరోజు నేను బాగా ప్రారంభించాను, కాబట్టి నా తీవ్రతతో నేను సంతోషంగా ఉన్నాను.’ అని కోహ్లీ అన్నాడు.
తాను మ్యాచ్ ముగించకపోవడం పట్ల కాస్త నిరాశను వ్యక్తం చేశాడు. కొన్ని సార్లు పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పుకొచ్చాడు. పిచ్ గురించి మాట్లాడుతూ.. సాధారణంగా చిన్నస్వామిలో ఉండే పిచ్ కంటే ఈ పిచ్ చాలా నెమ్మదిగా ఉందన్నాడు.
పిచ్ పై ఏ మాత్రం గడ్డి లేదన్నాడు. గత మూడు నాలుగు రోజులుగా చాలా ఎండగా ఉందన్నాడు. దీంతో పిచ్ పొడిగా మారిందన్నాడు. దీంతో వికెట్ స్లో మారిందని, ఈ విషయాన్ని తాము ముందే గ్రహించామన్నాడు.
RCB vs LSG : 1 రన్ తేడాతో కోహ్లీ 66 హాఫ్ సెంచరీ మిస్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్..
అందుకనే పవర్ ప్లేలోనే దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకోవాలని అనుకున్నామని తెలిపాడు. అదే విధంగా చేసినందుకు ఆనందంగా ఉందన్నాడు. మొత్తంగా తన బ్యాటింగ్ పట్ల కోహ్లీ సంతోషాన్ని వ్యకం చేశాడు.
