RCB vs LSG : 1 రన్ తేడాతో కోహ్లీ 66 హాఫ్ సెంచరీ మిస్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్..
బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై ఆర్సీబీ (RCB vs LSG)విజయం సాధించింది.
IPL 2026 RCB vs LSG Anushka Sharma reaction viral after Virat Kohli Misses 66th Half century By Just 1 Run
- ఐపీఎల్లో ఫామ్‌ను కొనసాగిస్తున్న విరాట్ కోహ్లీ
- లక్నో పై 1 రన్ తేడాతో హాఫ్ సెంచరీ మిస్
- అనుష్క శర్మ రియాక్షన్ వైరల్
RCB vs LSG : ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 147 లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. 34 బంతుల్లో ఆరు ఫోర్లు ఓ సిక్స్ సాయంతో 49 పరుగులు చేశాడు. ఐపీఎల్లో తన 66 హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నట్లుగా కనిపించాడు. అయితే.. అతడిని దురదృష్టం వెంటాడింది. 49 పరుగుల వద్ద అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద నికోలస్ పూరన్ క్యాచ్ అందుకోవడంతో ఆర్సీబీ మాజీ కెప్టెన్ తృటిలో హాఫ్ సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
ALSO READ : రోహిత్ శర్మ గాయంపై కీలక అప్డేట్.. పంజాబ్‌తో మ్యాచ్ కష్టమేనా?
Anushka Sharma Disappointed when Virat Kohli dismiss at 49 runs pic.twitter.com/cyYgIUND3M
— Learn-Survive (@pandu291190) April 15, 2026
పూరన్ క్యాచ్ అందుకోవడాన్ని చూసిన ఫ్యాన్స్‌తో పాటు కోహ్లీ భార్య అనుష్క శర్మ తీవ్ర నిరాశ చెందారు. కాగా.. కోహ్లీ ఔట్ అయినప్పుడు అనుష్క ఇచ్చిన రియాక్షన్స్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (40; 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుష్ బదోని (38; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ముకుల్ చౌదరి (39; 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం దార్ నాలుగు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు. కృనాల్ పాండ్యా రెండు వికెట్లు, జోష్ హేజిల్‌వుడ్ ఓ వికెట్ సాధించాడు.
ALSO READ : కోల్‌కతాకు షాక్.. అజింక్యా రహానేకు భారీ జరిమానా..
అనంతరం విరాట్ కోహ్లీ (49; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), రజత్ పాటిదార్ (27; 13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), జితేశ్ శర్మ(23; 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో విజయం. ప్రస్తుతం 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
