IPL 2026: భళా బెంగళూరు.. ఢిల్లీపై ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 75 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బెంగళూరు బౌలర్లలో హేజిల్ వుడ్ 4 వికెట్లతో చెలరేగాడు.
- Naveen
- Updated on- April 27, 2026 / 10:07 PM IST
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. ఢిల్లీపై ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లు చెలరేగారు. ఢిల్లీ బ్యాటర్లను బెంబేలెత్తించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 75 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బెంగళూరు బౌలర్లలో హేజిల్ వుడ్ 4 వికెట్లతో చెలరేగాడు. భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో మెరిశాడు. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లు విలవిలలాడారు. ఆ జట్టులో ఏకంగా ముగ్గురు డకౌట్ అయ్యారు. ఢిల్లీ జట్టులో హయస్ట్ స్కోర్ అభిషేక్ పోరెల్ దే(30). మిల్లర్ 19 పరుగులు, జేమిసన్ 12 రన్స్ చేశారు.
76 పరుగుల స్వల్ప టార్గెట్ ను 6.3 ఓవర్లలోనే చేజ్ చేసింది ఆర్సీబీ. 9 వికెట్ల తేడాతో డీసీని చిత్తు చేసింది. ఈ సీజన్ లో బెంగళూరుకు ఇది 6వ విజయం. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కు హ్యాట్రిక్ పరాజయం.
