అట్లుంటది మనతోని.. సంజూ జాతకం అంతా తెలుసు కదా.. మా ట్రాప్ లో పడ్డాడు.. రియాన్ పరాగ్ బయటపెట్టిన సీక్రెట్..

సంజూ శాంస‌న్‌ను (Sanju Samson ) ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తోనే ఔట్ చేసిన‌ట్లు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ తెలిపాడు.

IPL 2026 RR vs CSK Riyan Parag revealed that how they plan for Sanju Samson wicket

  • ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మైన సంజూ శాంస‌న్‌
  • ట్రాప్ చేసి ఔట్ చేసిన‌ట్లు వెల్ల‌డించిన రియాన్ ప‌రాగ్‌

Sanju Samson : కొన్నేళ్ల పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ఆడిన సంజూ శాంస‌న్ ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు ట్రేడింగ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు బ‌దిలీ అయ్యాడు. సంజూ శాంస‌న్ వెళ్లిపోవ‌డంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను రియాన్ ప‌రాగ్ అందుకున్నాడు. ఇక ఐపీఎల్ 2026లో భాగంగా సోమ‌వారం సీఎస్‌కే, ఆర్ఆర్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ సీజ‌న్‌లో ఈ రెండు జ‌ట్ల‌కు ఇదే తొలి మ్యాచ్‌.

ఇక ఆర్ఆర్ గురించి పూర్తి అవ‌గాహ‌న ఉన్న సంజూ శాంస‌న్ (Sanju Samson) రాజ‌స్థాన్ పై చెల‌రేగుతాడ‌ని అంతా ఆశించారు. అయితే.. అలా జ‌ర‌గ‌లేదు స‌రికదా.. సంజూ శాంస‌నే ఆర్ఆర్ ప్ర‌ణాళిక‌ల‌లో చిక్కుకుని ఔట్ అయ్యాడు.

చాలా ఏళ్లుగా శాంస‌న్‌తో క‌లిసి ఆడాడు రియాన్ ప‌రాగ్. సంజూకు నెట్స్‌లో బౌలింగ్ వేసిన అనుభ‌వం కూడా ఉంది. ఒక్క‌సారి సంజూ క్రీజులో కుదురుకుంటే ఎంత‌టి విధ్వంసాన్ని సృష్టిస్తాడో అత‌డికి బాగా తెలుసు. అందుక‌నే అత‌డు ల‌య‌లోకి రాక‌ముందే ఔట్ చేసేందుకు పక్కా ప్రణాళిల‌ను రూపొందాడు.

Smriti Mandhana : ఇదేంద‌య్యా సామీ.. బ్లూ మెటాలిక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న స్మృతి మంధాన‌..

మ్యాచ్ అనంతరం జరిగిన విలేక‌రుల స‌మావేశంలో రియాన్ ప‌రాగ్ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించాడు. తాము అనుకున్న విధంగానే సంజూ శాంస‌న్ ఇన్నింగ్స్ ఆరంభంలో బంతులు ఆడాడని ప‌రాగ్ చెప్పాడు. ప్ర‌ణాళిక‌లు వ‌ర్కౌట్ అవుతుండ‌డంతో త‌న‌తో పాటు జ‌ట్టు స‌భ్యుల‌కు ఆత్మ‌విశ్వాసం వ‌చ్చింద‌న్నాడు. సంజూ కొట్టిన తొలి బౌండ‌రీ కూడా త‌మ ప్ర‌ణాళిలో భాగ‌మేన‌ని వెల్ల‌డించాడు.

శాంస‌న్‌కు ఫుల్ షాట్లు అంటే ఇష్టం..

‘సంజు భాయ్ పరిస్థితి చూస్తే నాకు జాలిగా ఉంది. మేము మొదటి మూడు బంతులు లేదా నాలుగు బంతుల్లో ఏదైనా అమలు చేయాలనుకున్నాం. మేం అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. దీంతో అలాగే ఫాలో అయ్యాం. మేం వేసే బంతుల‌కు సంజూ శాంస‌న్ మొద‌టి నాలుగు లేదా ఐదు బంతుల‌ను ఎలా ఆడ‌తాడో ఊహించి.. అందుకు త‌గ్గ‌ట్టుగా ఫీల్డ‌ర్ల‌ను సెట్ చేశాం. దీంతో అంత‌కంటే మెరుగైన‌, లేదా భిన్న‌మైన షాట్‌ను ప్ర‌య‌త్నించేలా చేశాం. ఇది ఒక ర‌కంగా జూద‌మే. దీని వ‌ల్ల మాకు అత‌డిని ఔట్ చేసే అవ‌కాశాలు ఎక్కువ అయ్యాయి.’ ప‌రాగ్ అన్నాడు.

RR vs CSK : ధోని రికార్డు బ‌ద్ద‌లైంది.. జేమీ ఓవ‌ర్ట‌న్ నువ్వు మామూలోడివి కాద‌య్యా..

ఉదాహరణకు అతను అవుటైన షాట్‌ మా ప్రణాళిక‌ల్లో భాగ‌మే. షార్ట్ బాల్ వేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాము. ఎందుకంటే సంజూకు పుల్ షాట్లు ఆడ‌డం అంటే చాలా ఇష్టం. అందుక‌నే అత‌డు భిన్న‌మైన షాట్ ఆడేలా ఉసిగొల్పాము. మా ప్ర‌య‌త్నం ఫ‌లించింది. ఒక‌వేళ మా ప్ర‌ణాళిక‌లు విఫ‌లం అయి ఉంటే అత‌డు భారీ ఇన్నింగ్స్ ఆడేవాడు. అప్పుడు నేను ఇక్క‌డ‌ సైలెంట్‌గా కూర్చొని ఉండేవాడిని. అని ప‌రాగ్ తెలిపాడు.

RR vs CSK : సీఎస్‌కేతో మ్యాచ్ అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌.. భ‌య‌ప‌డి త్వ‌ర‌గా ప‌డుకున్నా.. కేక్ కూడా క‌ట్ చేయ‌లేదు..

ఈ మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ 7 బంతులు ఆడాడు. ఓ ఫోర్ సాయంతో 6 ప‌రుగులు చేసి నంద్రే బర్గర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.